మార్చి నెల 15 నుంచి భిన్న వాతావరణం కనిపిస్తుంది వరుసగా గత 15 రోజులలనుంచి భారీ వర్షాలతో పాటు అక్కడక్కడా ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి , పట్టణ వాసులు చిరు జల్లులు ఆనందిస్తుంటే , అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతిని రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు .
ఈ సారి రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఓవైపు ఎండలు పెరుగుతూ ఉండగా మరోవైపు వర్షాలు పడుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.
గురువారం నుంచి ఆదివారం వరకు పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని అంచనా వేసింది. గురు – శుక్రవారాల్లో మూడు, నాలుగు జిల్లాల్లో, శని – ఆదివారాల్లో రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో వర్షాల ప్రభావం ఉంటుందని తెలిపింది.
అదే సమయంలో ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. నిన్న (బుధవారం) నిజామాబాద్, నిర్మల్, నాగర్కర్నూల్, ఆదిలాబాద్ జిల్లాల్లో 40 డిగ్రీల పైచిలుకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Share your comments