పార్లమెంట్ వర్షాకాలం సమావేశాలలో వాయిదాల పర్వం కొనసాగుతుంది ..ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమైన పార్లమెంట్ సమవేశంలో మధ్యప్రదేశ్ కు చెందిన లోక్సభకు చెందిన రీతి పథక్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రకృతి వ్యవసాయం ప్రోత్సహించడానికి ఎలాంటి పనులు జరుగుతున్నాయని అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ సహాయక మంత్రి కైలాష్ సమాధానమిస్తూ
కేంద్ర ప్రభుత్వం సహజ ,సేంద్రియ లేదా ప్రకృతి వ్యవసాయాని ప్రోత్సహించేందుకు నమామి గంగ కు సమీపంలోని 5 కి. మీ ల పరధిలోగల వ్యవసాయ భూమిని సేంద్రియ లేదా ప్రకృతి వ్యవసాయం కోసం తీసుకున్నామని, ప్రకృతి వ్యవసాయాని ప్రోత్సహించేందు ప్రత్యేకంగా 6018 కోట్లు నిధులను బడ్జెట్లో కేటాయించిందని అదేవిధంగా ICAR ద్వారా అన్ని వ్యవసాయ కోర్సులలో సహజ ,సేంద్రియ లేదా ప్రకృతి వ్యవసాయాని సంబందించిన సిలబస్ లను కూడా చేర్చే విధంగా చర్యలు ప్రారంభమైయ్యాయని , KVK శాస్త్రవేత్తల ద్వారా కూడా సేంద్రియ లేదా ప్రకృతి వ్యవసాయాని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అదేవిధంగా సహజ వ్యవసాయాన్ని అవసరమైన ఎరువులను కూడా సబ్సిడీ పై అందించనున్నట్లు తెలిపారు.
భారత ప్రభుత్వం రైతులకు ప్రతి నెలా రూ.3 వేల పెన్షన్.. ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి
ఇదే అంశంపై మరో లోక్ సభ ఎంపీ సునీల్ కుమార్ బింటు (బీహార్) సహజ ,సేంద్రియ లేదా ప్రకృతి వ్యవసాయంలో రసాయన ఎరువులు మరియు పురుగుల మందుల తగ్గించడానికి మరియు సహజ ,సేంద్రియ వ్యవసాయం రైతులకు లాభదాయకం గ మార్చడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అని అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ దేశంలో సేంద్రియ వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని నేషనల్ మిషన్ ఆన్ న్యా చురల్ ఫార్మింగ్ క్రింద సహజ వ్యవసాయం చేసే రైతులను ప్రోత్సహిస్తుందని తద్వారా 2013-2014 లో 11 లక్షల హెక్టర్లు ఉన్న సేంద్రియ లేదా ప్రకృతి వ్యవసాయం ఏరియా ప్రస్తుతం 69 లక్షల హెక్టర్లు పెరిగిందన్నారు. అదేవిధంగా దేశంలో రసాయనాల వాడకం గతంతో పోలిస్తే 6 రేట్లు తగ్గిందన్నారు కేంద్ర వ్యవసాయ సహాయ మంత్రి కైలాష్ చౌదరి.
Share your comments