మునపటి ఆర్టికల్ లో చర్చించినట్టు, మధ్య, పశ్చిమ భారత దేశ ప్రాంతాల మీదుగా సాగే MFOI VVIF కిసాన్ భరత్ యాత్ర, ఉత్తర్ ప్రదేశ్ ఝాన్సీ నుండి ఘనంగా ఆరంభమయ్యింది. అయితే ఈ కార్యక్రం ఎంత మందికి ఆతిధ్యం ఇచ్చింది, ఎటువంటి కార్యాక్రమాలు చోటు చేసుకున్నాయి అనే అంశాన్ని మీద ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకోండి.
భారత దేశంలో, ఉంటూ వ్యవసాయం తమ జీవన ఉపాధిగా మార్చుకుని, వ్యవసాయం ద్వారా కోటీశ్వరులైన రైతులను, సత్కరించడం కిసాన్ భరత్ యాత్ర లక్ష్యం. మధ్య మరియు పశ్చిమ రాష్ట్రాల వైపుగా సాగుతూ, వివిధ రాష్ట్రాల్లోని రైతులను, వారు చేస్తున్న గొప్ప పనులను కొనియాడుతూ, ఈ యాత్ర ముందుకు సాగుతుంది. వ్యవసాయం కేవలం నష్టాలతో కూడిన వ్యాపారం అని భావిస్తున్న చాలా మంది రైతులకు, వ్యవసాయంలో లాభాలు సాధిస్తున్న రైతులను ఆదర్శంగా చూపించి వారిలో కొత్త ఆశలు చిగురించేందుకు ఈ యాత్ర సహాయ పడుతుంది.
మార్చ్ 5,2024 రోజున, ఉత్తర్ ప్రదేశ్ ఝాన్షి నుండి ప్రారంభం అయ్యింది MFOI VVIF కిసాన్ భరత్ యాత్ర. రాణి లక్ష్మి భాయ్ సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుండి ఈ యాత్ర ప్రారంభం అయ్యింది. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, Dr. అశోక్ కుమార్ సింగ్, ఈ యాత్రను జండా ఊపి ప్రారంభించారు. ఉత్తర మరియు దక్షిణ భారత దేశ రాష్ట్రాల మీదుగా ఈ యాత్ర ఇప్పటికే ప్త్రారంభం అయ్యింది. ఇప్పుడు మూడోవ సారి పార్రంభం అయిన యాత్ర మధ్య, పశ్చిమ భారత రాష్ట్రాల్లో సంచరిస్తుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్, వైస్ చైర్మన్, అనిల్ కుమార్ వర్మ, మహీంద్రా ట్రాక్టర్లు తరపు నుండి అశ్విని సింగ్, మరియు ఈ కార్యక్రమానికి మూలా కారణమైన కృషి జాగారం, మీడియా సంస్థ స్థాపకులు మరియు ముఖ్య సంపాదకులు, ఎం. సి. డొమినిక్ ,మేనేజింగ్ డైరెక్టర్. షైనీ డొమినిక్ హాజరు అయ్యారు. కొన్ని వందల మంది ఔత్సాహికులైన రైతులు ఈ కార్యక్రమానికి హాజరై ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నారు. జైన్ ఇరిగేషన్ కంపెనీ వారి నీటీ పారుదలకు అవసరయ్యే ఉత్పతునాలు ఈ కార్యకరంలో ప్రదర్శనలో ఉంచారు. మరియు ఆ ప్రాంతంలో వ్యవసాయం ద్వారా మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్న రైతులను సత్కరించారు.
స్వతహాగా ఒక రైతు అయినటువంటి ఎం. సి. డొమినిక్ మాట్లాడుతూ, భూమిని దున్ని పంటలు పండించేది కేవలం ఆదాయం కోసమే కాదని, దీని ద్వారా కొన్ని కోట్ల మంది జనాభా కడుపు నిండుతుంది అని, అయన ప్రసంగించారు. తమ సంస్థ ద్వారా ప్రారంభం అయిన MFOI అవార్డులు దేశానికి అన్నం పెట్టె రైతుల కష్టానికి, ఒక గుర్తింపుగా నిలుస్తాయి అని అయన తెలిపారు. వ్యవసాయం ద్వారా కోట్లు సంపాదిస్తున్న రైతులను గుర్తించి వారిని పురస్కరించడం ద్వారా మిగిలిన రైతులు కూడా వారి నుండి ప్రేరరణ పొంది విజయాలు సాధించ్చే దిశగా అడుగులు వేస్తారు.
MFOI అవార్డుల రైతులకు పురస్కరించే సమయంలో నిర్వహించే కార్యక్రమాలకు చాల మంది రైతులు ఈ కార్యక్రమాలకు హాజరు అవుతారు. కాబట్టి అగ్రిటెక్ కంపెనీలకు, వాళ్ల ఉత్పత్తులను రైతుల వరకు తీసుకుపోవడానికి ఈ కార్యక్రమలు ఒక వంతెనల నిలుస్తాయి. కాబట్టి ఇప్పుడే మీ స్టాల్ ని బుక్ చేసుకోండి. బుకింగ్ కొరకు: Register
Share your comments