నవంబర్ 12 న హిమాచల ప్రదేశ్ , డిసెంబర్ 1 ,5 తేదీలలో గుజరాత్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే ,అయితే ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 8 న EC వెల్లడించగా ,గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ 189 స్థానాలకు 156 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది , హిమాచల్ ప్రదేశ్ లో 68 స్తనాలకు గాను 40 అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకొని ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమయ్యాయి , కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకు వేసి హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్ సింగ్ సుఖు ను ప్రకటించింది .
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్ సింగ్ సుఖు నేడు ఆదివారం ప్రమాణ స్వీకారం చేసారు . ఉప ముఖ్యమంత్రిగా ఆ పార్టీ నేత ముఖేశ్ అగ్నిహోత్రి ప్రమాణ స్వీకారం చేశారు.సిమ్లాలోని రిడ్జ్‌లో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ నేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వాద్రా , రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ హాజరయ్యారు. ముఖేశ్ అగ్నిహోత్రి మాట్లాడుతూ, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను మొదటి కేబినెట్ సమావేశంలోనే నెరవేర్చుతామని చెప్పారు. పాత పింఛను పథకాన్ని పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు .
2023 మార్చ్ 31 లోగ పాన్ -ఆధార్ లింక్ చేయాల్సిందే .. మీ లేదంటే బ్యాంకింగ్ సేవలకు ఆటంకం
పార్టీలో ఎలాంటి విభేదాలు లేకుండా పని చేస్తామని .. ప్రమాణ స్వీకారానికి హాజరైన MLA లు తెలిపారు .
Share your comments