
రిజర్వేషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. రిజర్వేషన్లు ఇంకెన్నాళ్లు అని ప్రశ్నించింది. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు దాటినా ఇంకా రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని, ఇంకా ఎన్ని తరాలపాటు కొనసాగుతాయని సుప్రీం ప్రశ్నించింది.
మరాఠాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై గత కొంతకాలంగా విచారణ జరుగుతోంది. రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం కోటా పరిమితిని తొలగిస్తే.. మరికొన్ని తరాలపాటు దానిని కొనసాగిస్తారని సుప్రీం తెలిపింది.
1931తో పోల్చితో జనాభా అనేక రెట్లు పెరిగి 135 కోట్లకు చేరుకుందని, రాష్ట్రాలు సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు ప్రవేశపెడుతున్నా.. అభివృద్ధి ఏం జరగలేది సుప్రీం వ్యాఖ్యానించింది. వెనుకబడిన వర్గాలు ముందుకు సాగలేదని అభిప్రాయపడింది.
Share your comments