2022 మార్చి 20కి ముందు COVID-19 కారణంగా మరణం సంభవించినట్లయితే నష్ట పరిహారం కోసం క్లెయిమ్‌లను ఫైల్ చేయడానికి చివరి తేదీలను ప్రకటించింది.
సుప్రీంకోర్టు 2021 మార్చి 24వ తేదీ నాటి తన ఉత్తర్వును 2021 యొక్క ఇతర దరఖాస్తు నం. 1805లో రిట్ పిటీషన్ (సి) నం. 539 2021లో అమలు చేసింది. (National Disaster Management Authority) నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ covid 19 కారణంగా మరణించిన మృతులను ప్రకటిస్తుంది.మృతుల యొక్క కుటుంబ సభ్యులు వారికి నష్ట పరిహారాన్ని (EX GRATIA) దాఖలు చేయడానికి చివరి గడువుని సుప్రీంకోర్టు నిర్ణయించింది.
గౌరవ న్యాయస్థానం జారీ చేసిన కీలక ఆదేశాలు ప్రకారం 2022 మార్చి 20కి ముందు COVID-19 కారణంగా మరణం సంభవించినట్లయితే పరిహారం కోసం క్లెయిమ్‌లను ఫైల్ చేయడానికి 24 మార్చి 2022 నుండి అరవై రోజుల(రెండు నెలలు) గడువు ఉంటుంది. భవిష్యత్తులో COVID-19 కారణంగా మరణాలు సంభవిస్తే పరిహారం కోసం దావా వేయడానికి మరణించిన తేదీ నుండి తొంభై రోజుల సమయం ఉండేట్లు నిర్ణయించింది. నష్టపరిహార దాఖలు స్వీకరించిన తేదీ నుండి ముప్పై రోజుల వ్యవధిలో పరిహార చెల్లింపు చెల్లింపును చేయడానికి మునుపటి ఆర్డర్ అమలులో కొనసాగుతుంది.
జరుగుతుంది.
నిర్దేశించిన గడువులోగా దరఖాస్తు చేయలేని పక్షంలో, క్లెయిమ్‌దారు ఫిర్యాదు పరిష్కార కమిటీని సంప్రదించి, అనుమతి పొందవచ్చని గౌరవ న్యాయస్థానం ఆదేశించింది. సందర్భానుసారంగా ఫిర్యాదులు, పరిష్కార కమిటీ ద్వారా పరిగణించబడుతాయి అని వెల్లడించింది.అంతేకాకుండా, ఫేక్ క్లెయిమ్‌ల ప్రమాదాన్ని తగ్గించే ప్రయత్నంలో, మొదటి సందర్భంలో 5% క్లెయిమ్ దరఖాస్తులను యాదృచ్ఛికంగా పరిశీలించాలని గౌరవ న్యాయస్థానం ఆదేశించింది. ఎవరైనా నకిలీ క్లెయిమ్ చేసినట్లు తేలితే, అది DM చట్టం, 2005లోని సెక్షన్ 52 కింద పరిగణించబడుతుందని మరియు తదనుగుణంగా శిక్షించబడుతారని తెలిపింది.
మరిన్ని చదవండి.
ప్రపంచంలోనే అతి పెద్ద సౌరవృక్షం ఎక్కడ ఉందొ తెలుసా ?
Share your comments