News

మారటోరియం ఎంచుకున్నవారికి గుడ్‌న్యూస్

KJ Staff
KJ Staff

లాక్‌డౌన్ కాలంలో లక్షలమంది ఉద్యోగాలు కోల్పోవడంతో లోన్ల ఈఎంఐలపై మారటోరియం విధిస్తూ ఆర్‌బీఐ ఊరట కల్పించిన విషయం తెలిసిందే. గత ఏడాది మార్చి నుంచి ఆగస్టు వరకు లోన్ల ఈఎంఐలపై మారటోరియం విధించారు. కానీ మారటోరియం కాలంలోని ఈఎంఐలకు వడ్డీపై వడ్డీని బ్యాంకులు కస్టమర్ల నుంచి వసూలు చేస్తున్నాయి.

దీనిపై కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. గత కొంతకాలంగా దీనిపై సుప్రీంలో విచారణ జరుగుతోంది. అయితే తాజాగా సుప్రీంకోర్టు ఎట్టకేలకు తీర్పు వెలువరించింది. మారటోరియం ఎంచుకున్న వారికి వడ్డీపై వడ్డీ వసూలు చేయవద్దని బ్యాంకులకు సుప్రీం సూచించింది. బ్యాంకులు ఇప్పటికే వసూలు చేసి ఉంటే.. వాటిని వెనక్కి తిరిగి ఇచ్చేయాలని సూచించింది

అటు ఆర్థిక విషయాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని, ఆర్‌బీఐని ఆదేశించలేమని సుప్రీంకోర్టు తెలిపింది. ఆర్థికపరమైన విషయాల్లో న్యాయపరమైన సమీక్ష చేపట్టలేమంది. ఇక మారటోరియం కాలాన్ని పొడిగించలేమని సుప్రీం తెలిపింది. కాగా ఇప్పటికే రూ.2 కోట్ల వరకు ఉన్న రుణాలపై చక్రవడ్డీని కేంద్రం మాఫీ చేసిన విషయం తెలిసిందే.

Share your comments

Subscribe Magazine

More on News

More