News

మీరు అనాస పంట పండిస్తున్నారు? అయితే మీ పంట పండినట్టే....

KJ Staff
KJ Staff

మార్కెట్లో అనాస పండు(పైన్ ఆపిల్) డిమాండ్ రోజు రోజుకు అధికమవుతూ వస్తుంది. మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని [ప్రాంతాల్లో మాతమ్రే అనాసను పండిస్తారు. ఈ ఏడాది అనాస పంట పండిస్తున్న రైతులకు జాక్ పాట్ తగిలినట్టే అని చెప్పుకోవచ్చు. డిమాండ్ అధికంగా ఉండటంతో ఒక కేజీ 60 రూపాయిల వరకు అమ్ముడుపోవడంతో రైతులు, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఇదే సమయానికి ఒక కిలో అనాస ధర 48 రూపాయలకు రైతులు విక్రయించారు. దేశంలో ఎలక్షన్స్, ఐపీల్ సీసన్ నడుస్తుండటంతో అనాసకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది.

అంతే కాకుండా ఈ నెలలో, ఉగాది, రంజాన్ టూ పాటు ఇతర పండుగలు కూడా ఉండటంతో పైన్ ఆపిల్ సేల్స్ ఎక్కువయ్యాయి. దీనికి తోడు ఈ నెల పెళ్లి ముహుర్తాలు కూడా మొదలయ్యాయి, పెళ్లిళ్లు, ఫంక్షన్లలో, అనాసను జ్యూస్ల తయారీకి, మరియు కొన్ని వంటకాల్లోనూ ఎక్కువుగా ఉపయోగిస్తారు. వేసవి కాలం కావడంతో రాజకీయ పార్టీలు, తాము నిర్వహించే సభలకు హాజరైన ప్రజలకు, ఫ్రూట్ సలాడ్స్ లాగా పైన్ ఆపిల్ ముక్కలు ఇస్తున్నారు. మరియు ఐపీల్ వీక్షకులు కూడా అనాస ముక్కలు తింటూ మ్యాచులు వీక్షించడంతో అనాస కొనుగోళ్లు జోరందుకున్నాయి.

కానీ, పంట చేతికి వచ్చే ఇదే సమయానికి, అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న కారణంగా కొన్ని ప్రాంతాల్లోని రైతులు తమ పంట నష్టపోతున్నారు. ఎండలు అధికంగా ఉన్నందున, ఈ ఏడాది కేవలం 800 టన్నుల దిగుబడి వచ్చింది, పోయిన సంవత్సరం దిగుబడి 2000 టన్నులు ఉంది. అయితే మార్కెట్లో ఎక్కువ ధర వస్తున్న కారణంగా, ఈ నష్టాన్ని అధిగమించాచని రైతులు ఆశాజనకంగా ఉన్నారు. దిగుబడి తగ్గిపోవడం మరియు అధిక దిగుబడి ఉన్నందున రైతులకు లాభం చేకూర్చిన, సామాన్యునికి మాత్రం చుక్కలు చూపిస్తుంది, వ్యాపారులు రేట్లు అమాంతం పెంచడంతో సామాన్య ప్రజలు అనాసను కొనుగోలు చేసేందుకు సంకోచిస్తున్నారు.

Share your comments

Subscribe Magazine

More on News

More