2014 వ సంవత్సరంలో అమలు అయిన 'స్వచ్ఛ భారత్ మిషన్' పథకం ఏడేళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని పురస్కరించుకొని తాజాగా ‘స్వచ్ఛక కి జ్యోత్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
గృహనిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ్ భారత్ మిషన్-అర్బన్ 2.0, 'చెత్త రహిత నగరాల' కోసం కొనసాగుతున్నకార్యక్రమాన్ని బలోపేతం చేయడానికి 'చెత్త రహిత నగరాల కోసం నేషనల్ బిహేవియర్ చేంజ్ కమ్యూనికేషన్ ఫ్రేమ్‌వర్క్‌ప్రారంభించింది.
15 ఆగస్ట్ 2014 న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా 'క్లీన్ ఇండియా' అభివృద్ధి ప్రాధాన్యతగా మారాలని ప్రధానమంత్రి అమలు చేసిన స్వచ్ఛ భారత్ మిషన్ భారతదేశం పారిశుద్ధ్య రంగంలో ఒక విప్లవాన్ని చూసింది.స్వచ్ఛత విషయం లో ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది.
ఇప్పుడు, SBM-U 2.0 కింద, కొత్తగా ప్రారంభించబడిన ' చెత్త రహిత నగరాల కోసం జాతీయ ప్రవర్తన మార్పు కమ్యూనికేషన్ ఫ్రేమ్‌వర్క్' అనేది రాష్ట్రాలు మరియు నగరాలకు మార్గనిర్దేశక పత్రం మరియు బ్లూప్రింట్‌గా పని చేస్తుంది. గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of Housing and Urban Affairs) మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ మనోజ్ జోషి ప్రారంభించిన ఈ ఫ్రేమ్‌వర్క్ వ్యర్థాల ప్రాసెసింగ్, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ వంటి కీలకమైన అంశాల పై దృష్టి పెడుతుంది.
ఆవిష్కరణ కార్యక్రమంలో శ్రీ మనోజ్ జోషి మాట్లాడుతూ, “మిషన్ కింద అద్భుతమైన మార్పును సాధించడాన్ని మేము గమనించాము. SBM-U 2.0 యొక్క విజన్‌ను సాధించే దిశగా ముందుకు సాగుతూనే, స్వచ్ఛ్ భారత్ మిషన్ యొక్క గత ఏడు సంవత్సరాలలో సాధించిన విజయాలను కొనసాగించే దిశగా కృషి చేయాలనీ వ్యాఖ్యానించారు.
స్వచ్ఛ్ భారత్ మిషన్ గురించి తెలుసుకోండి.
అక్టోబర్ 2 , 2014 న స్వచ్ఛ్ భారత్ మిషన్ ప్రారంభించబడింది.
మిషన్ ప్రారంభించినప్పటి నుండి 10 కోట్లకు పైగా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించబడ్డాయి; ఫలితంగా, అన్ని రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాలు 2 అక్టోబర్ 2019 నాటికి తమను తాము ODFగా (బహిరంగ మల మూత్ర విసర్జన) ప్రకటించుకున్నాయి.
ఈశాన్య రాష్ట్రాలు మరియు హిమాలయ రాష్ట్రాలు మరియు J&K కోసం, కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య నిధుల భాగస్వామ్య విధానం 90:10గా; ఇతర రాష్ట్రాలకు 60:40 గా ఉంది మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు 100% నిధులు కేంద్రం సమకూరుస్తుంది.
మరిన్ని చదవండి.
Share your comments