News

తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రైవేట్ TNAU -అనుబంధ కళాశాలల్లో 5% కోట!

Srikanth B
Srikanth B

తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ, టిఎన్ ఎయు, విశ్వవిద్యాలయంలో నమోదు చేసుకున్న విద్యార్థులకు ఆయా వృత్తి విద్య కోర్స్ లో 5% కోటాను పునరుద్ధరించనున్నట్లు పేర్కొంది. ఈ పునరుద్ధరణ టిఎన్ ఎయు యొక్క ప్రైవేట్ అనుబంధ కళాశాలలకు కూడా వర్తిస్తుంది.

ఇంతకు ముందు 2019 వరకు తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం లో దరకాస్తు చేసుకున్న అభ్యర్థులకు తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుబంధ ప్రైవేటు కలశాలలో 5 % రిసర్వేషన్ ఉండేది .2019 తరవాత చాల కళాశాలలు ఈ రిజర్వేషన్ ను తీసివేశాయి.

అయితే  తమిళనాడులోని ఫోరం ఆఫ్ ఎడ్యుకేషన్ డెవలప్ మెంట్ కో ఆర్డినేటర్ ఎస్ మూర్తి తన కుమారుడి తరఫున ఈ రిజర్వేషన్ తొలగింపుకు వ్యతిరేకం గ  పిల్ దాఖలు చేసారు . ఈ  పిల్ పై విచారణ జరిపిన ధర్మాసనం   ప్రైవేట్ కళాశాలల్లో 5% కోటాను పునరుద్ధరించాలని ఉత్తర్వులను జారీచేసింది .

అయితే, పునరుద్ధరణ ఫలితంగా, 200 కి పైగా ఉచిత  సీట్లు విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి. 2022 ఫిబ్రవరి 24, గురువారం నాడు 150 మంది విద్యార్థులు ఆన్ లైన్ కౌన్సిలింగ్ పొందారు. ఇప్పటికే 110 మంది విద్యార్థులను షార్ట్ లిస్ట్ చేశారు' అని అధికారులు తెలిపారు.

2019లో మద్రాస్ హైకోర్టు 5% కోటాను తమిళనాడు అంతటా ప్రభుత్వ  కళాశాలలు మరియు అనుబంధ ప్రైవేట్ కళాశాలలు రెండింటికీ వర్తింపజేయాలని తీర్పు ఇచ్చింది.

తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం (టిఎన్ఎయు) 1868లో తమిళనాడులోని మద్రాసులోని సైదాపేట్ లో వ్యవసాయ పాఠశాల ను ఏర్పాటు చేయడంతో ప్రారంభమై, తరువాత కోయంబత్తూరుకు మార్చబడింది. ఇది 1920 లో మద్రాసు విశ్వవిద్యాలయంతో అనుసంధానించబడింది. టిఎన్ ఎయు వ్యవసాయ విద్య మరియు పరిశోధన   జరిపి రాష్ట్రము యొక్క వ్యవసాయ విభాగానికి పూర్తి మద్దతు ఇస్తుంది .

ఇంకా చదవండి.

ఉత్కల్ కృషి మేళా 2022 !

అత్యుత్తమ రైతు అవార్డు "ధరతి మిత్ర" ను ప్రధానం చేసిన ఆర్గానిక్ ఇండియా

Share your comments

Subscribe Magazine

More on News

More