News

300 రేషన్‌ దుకాణాల్లో రూ. 60 కి టమాటో విక్రయాలు..

Srikanth B
Srikanth B
300 రేషన్‌ దుకాణాల్లో రూ. 60 కి టమాటో విక్రయాలు..
300 రేషన్‌ దుకాణాల్లో రూ. 60 కి టమాటో విక్రయాలు..

భారీగా పెరిగిన టమాటో ధరలతో సామాన్య మధ్య తరగతి ప్రజలు కూరగాయలు కొనే పరిస్థితి కనిపించడంలేదు దీనితో తమిళనాడు ప్రభుత్వం ప్రజలకు సబ్సిడీ పై 120 రూపాయలు ఉన్న టొమాటోను 60 రూపాయలకు విక్రయించాలని నిర్ణయం తీసుకుంది తాజా నిర్ణయంతో ప్రజలపై ఆర్థిక భారం తగ్గి కాస్త ఊరట లభించే అవకాశమని ఉంది.

టమోటాల ధరలు తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర సన్నాహాలు చేపడుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి విస్త్రతంగా విక్రయాలు చేపట్టాలని నిర్ణయించింది. మొత్తం 300 రేషన్‌ దుకాణాల్లో(300 ration shops) టమోటాలు విక్రయించనున్నట్లు సహకారశాఖ ప్రకటించింది.గతంలో 85 షాపులలో విక్రయాలు చేసిన ప్రభుత్వం ఇప్పుడు 300 రేషన్ దుకాణాలలో ప్రజలకు 60 రూపాయలు కిలో చోపున్న అందించాలని తెలిపారు.


పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రభుత్వం ప్రజలపై ఆర్థిక భారం పడకుండా ధరలను తగ్గించి సబ్సిడీ పై అమ్ముతుంది . తెలంగాణాలో మాత్రం పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది పెరిగిన కూరగాయల ధరలతో పేద మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

కిలో టమోటా కేవలం రూ.1.. ఎక్కడో తెలుసా?

మొదటి విడతగా నగరంలోని 85 రేషన్‌ దుకాణాల్లో కిలో టమోటా రూ.60కి విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో, కూరగాయలు, నిత్యావసర సరుకుల పెరుగుదలపై సోమవారం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ అధికారులతో సమావేశమై చర్చించారు. ఆయన సూచనల మేరకు రాష్ట్రవ్యాప్తంగా 300 రేషన్‌ దుకాణాల్లో బుధవారం నుంచి టమోటాలు విక్రయించనున్నట్లు సహకార శాఖ ప్రకటించింది.

కిలో టమోటా కేవలం రూ.1.. ఎక్కడో తెలుసా?

Related Topics

free tomatoes

Share your comments

Subscribe Magazine

More on News

More