జనసేన పార్టీ అధినేత, పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్న వారాహి యాత్రకు తిరుగులేని మద్దతు తెలుపుతూ తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ప్రముఖ నాయకుడు, హిందూపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసన సభ సభ్యుడు (ఎమ్మెల్యే) నందమూరి బాలకృష్ణ అధికారిక ప్రకటన చేశారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన నంద్యాలలోని ఆర్కే ఫంక్షన్ హాల్‌లో శనివారం టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశం జరిగింది.
సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన బాలయ్య ఈ విషయంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రజాసంక్షేమానికి విఘాతం కలిగించడం, చంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేయడం ముఖ్యమంత్రి జగన్‌పై తీవ్ర నిరాశ, నిస్పృహలను వ్యక్తం చేశారు బాలకృష్ణ. ఏ ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేశారని బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్షతోనే చంద్రబాబుపై స్కిల్ కేసును పెట్టారని ఆయన ఆరోపించారు.
తెలుగుదేశం పార్టీ (టిడిపి), జనసేన కలిసింది అభివృద్ధి సాధించేందుకేనని బాలయ్య అన్నారు. ఈరోజునుంచి ప్రారంభం కానున్న నాలుగో విడత వారాహి యాత్రకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు బాలకృష్ణ తెలిపారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొనడమే కాకుండా విజయవంతానికి తమవంతు సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.
చంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న టీడీపీలోని ప్రముఖురాలు నారా భువనేశ్వరి నిరాహారదీక్ష చేపట్టనున్నట్లు బాలయ్య వెల్లడించారు. ఇవాళ్టీ నుంచి నాలుగు రోజుల పాటు వివిధ రూపాల్లో నిరసనలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..
ప్రజలకు గమనిక.. అక్టోబర్ నెలలో దాదాపు 10 రోజులపాటు సెలవులు.. ఇప్పుడంటే?
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాల్గవ దశ వారాహి యాత్రను అక్టోబర్ 1వ తేదీన అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. టీడీపీతో పొత్తు ప్రకటించిన తర్వాత సాగనున్న ఈ యాత్రపై అందరి దృష్టి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పైనా, ఆయన పార్టీ వైఎస్సార్‌సీపీపైనా పవన్ కళ్యాణ్ నిర్భయంగా విమర్శలు గుప్పించడంతో యాత్ర జరుగుతున్న ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలు ఘాటుగానే స్పందించారు. మాజీ మంత్రి పేర్ని నాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాసులు, ఏపీ మంత్రి జోగి రమేష్‌తో పాటు పలువురు ప్రముఖులు పవన్ కళ్యాణ్‌పైనా, ఆయన పార్టీపైనా తీవ్ర స్థాయిలో తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో అక్టోబర్ 1 నుండి జరిగే వారాహి యాత్రలో తనను నిత్యం విమర్శించే వైఎస్ఆర్‌సీపీ ప్రజా ప్రతినిధులు ప్రాతినిథ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగనుంది. ఈ నియోజకవర్గాల్లో యాత్ర సాగే సమయంలో తనపై విమర్శలు చేసే నేతలకు పవన్ కళ్యాణ్ ఏ రకమైన కౌంటర్ ఇస్తారోననే చర్చ సర్వత్రా సాగుతుంది.
ఇది కూడా చదవండి..
Share your comments