విదేశీ పర్యటనకి వెళ్లిన ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.రామారావు తెలంగాణాకి పెద్ద మొత్తంలో పెట్టుబడులు తీసుకువచ్చారు.
సుమారుగా పద్దెనిమిది రోజులు, మూడు దేశాలలో అంతర్జాతీయ అగ్రశ్రేణి వ్యాపారవేత్తలతో అనేక సమావేశాలు నిర్వహించి తెలంగాణకి రూ.11,700 కోట్లు! తీసుకువచ్చారు.మార్చిలో రాష్ట్రం నుండి యుఎస్‌కి వెళ్ళిన మంత్రి కె.టి.రామారావు బృందం వారం రోజుల పర్యటనలో అనేక రంగాలలో రూ. 7,500 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మరల మేలో అతను ప్రపంచ ఆర్థిక వేదిక (World Economic Forum) సమావేశానికి యునైటెడ్ కింగ్‌డమ్‌కు మరియు తర్వాత స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు బయలుదేరారు.ఈ సమావేశంలో రాష్ట్రానికి 10 రోజుల వ్యవధిలో రూ. 4,200 కోట్ల పెట్టుబడులను తీసుకువచ్చారు. వివిధ బహుళజాతి కంపెనీల (multi national companies) ఉన్నత అధికారులతో వ్యాపార సమావేశాల ఫలితంగా ఈ పెట్టుబడులు వచ్చాయి. ఇందులో మంత్రి కె.టి.రామారావు అనేక రౌండ్ టేబుల్ సమావేశాలలో కూడా పాల్గొన్నారు.
ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ కె భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ దావోస్ పర్యటనలు చాలా ఉత్తమ ఫలితాలు కనబరిచాయని, తెలంగాణను పెట్టుబడిదారుల గమ్యస్థానంగా మార్చిందని వ్యాఖ్యానించారు.
కేవలం ఐటీ పరిశ్రమ మాత్రమే కాకుండా ఫార్మా, ఆటో పార్ట్స్, పరిశోధన&అభివృద్ధి విభాగం , లైఫ్ సైన్సెస్ మరియు రైలు కోచ్ తయారీ యూనిట్లు వంటి ఇతర రంగాలలో కూడా పెద్ద మొత్తంలో పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. రానున్నపెట్టుబడుల వలన తెలంగాణాలో నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుందని విశ్వాసం వ్యక్తం చేసారు.
మరిన్ని చదవండి
Share your comments