కెసిఆర్ ప్రభుత్వం లో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ భవిష్యత్తు ఆకాశమే హద్దుగా ఎదుగుతుంది. "నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణి" అన్న మాట ఇప్పుడు రెట్టింపయింది. కెసిఆర్ కృషి, ప్రభుత్వ సహకారం తో తెలంగాణ రెండు కోట్ల ఎకరాల మాగాణి గా మారింది.
రెండు సీసన్ లలో కలిపి రికార్డు స్థాయి లో 2 కోట్ల ఎకరాలలో సాగు నమోదయింది. వానాకాలం లో 1.36 కోట్ల ఎకరాలలో సాగు నమోదవ్వగా , యాసంగి లో 72. ఎకరాలలో వివిధ పంటల సాగు నమోదయ్యింది. ఒక ఏడాదిలో ఈ స్థాయి లో పంటలు నమోదు కావడం ఉమ్మడి ఎపి, తెలంగాణ రాష్ట్ర చరిత్ర లో ఇదే మొదటి సారి కావడం గమనార్హం .
ఈ ఏడాది ప్రత్యేకించి వరి సాగులోను కొత్త రికార్డులు సృష్టించబడ్డాయి. రాష్ట్రము లో తొలిసారిగా 1. 21 ఎకరాల్లో వారి నాట్లు పడ్డాయి. మొత్తం పండిన పంటల్లో 60 % వరి పంటే సాగు అవ్వడం మరో రికార్డు.
ఉమ్మడి ఎపి లో తెలంగాణ పంట భూములన్నీ సమృద్ధి గ నీరులేక బీడు భూములుగా ఉండేవి, అయితే కెసిఆర్ ప్రభుత్వం వచ్చాక అయన కృషి, వివిధ రైతు సంక్షేమ పథకాల వళ్ళ బీడు భూములన్నీ రెండు కోట్ల ఎకరాల పంట భూములుగా మారాయి.
ప్రభుత్వ చర్యలతో రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. 2015- 2021 నాటికే ఏడేండ్లలో ఏకంగా 117 శాతం సాగు వృద్ధి జరిగింది. తెలంగాణలో 2014-15 సంవత్సరంలో 62.48 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కాగా, 2020-21లో అది 1.35 కోట్ల ఎకరాలకు పెరిగింది. అంటే ఏడేండ్లలో 72.52 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం పెరగడం విశేషం. ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, చెక్‌డ్యాంల నిర్మాణం వంటి కార్యక్రమాలు పం టల సాగు విస్తీర్ణం పెరుగుదలకు దోహదం చేశాయి.
తెలంగాణ లో వ్యవసాయ రంగం భారీ అభివృద్ధి గమనించి పక్క రాష్ట్రాల రైతులు తెలంగాణ రాష్ట్రానికి వలస పోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి
ఇది కూడా చదవండి
Share your comments