రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్న తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి. తుమ్మల నాగేశ్వరావు, బ్యాంకులు వ్యవసాయ రంగానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. దేశ ఆర్ధిక వ్యవస్థలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న వ్యవసాయా రంగానికి పెద్దపీట వెయ్యాలని మంత్రి తెలిపారు. రైతుల అభ్యన్నతికి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న, అనేక పధకాలను ముందుకు తీసుకెళ్లేందుకు బ్యాంకర్లు సహకరించాలని కోరారు.
వ్యవసాయంతో పాటు, వ్యవసాయ అనుబంధ రంగాలైన, పశువుల పెంపకం, గొర్రెల పెంపకానికి, బ్యాంకులు తమ వంతు సహకారాన్ని అందించాలని హితవు పలికారు. బ్యాంకులకు గత ప్రభుత్వ పాలనలో జరిగిన తప్పులను సరిదిద్దుకోవాలని సూచించారు. రాష్ట్రంలో విచ్చిన్నమైన, వ్యవస్థలన్నిటినీ సరిచేసే దిశలో తమ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.
వేల కోట్లు అప్పులు ఎగ్గొటే, పెద్ద వ్యాపారులకు, ఎటువంటి గ్యారంటీ లేకుండానే అప్పులు ఇస్తూ, రైతులకు మాత్రం వారి చిన్న అవసరాలకు కూడా, వారి స్థలాల్ని తాకట్టు పెట్టుకొని, అప్పు తిరిగి తీర్చే వరకు ఎందుకు పీడిస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో తగ్గుతున్న పాల ఉత్పత్తి గురించి మంత్రి మాట్లాడారు. పాడి పరిశ్రమలు నెలకొల్పడానికి ముందుకు వచ్చే రైతులను ప్రోత్సహించి, వారికీ రుణాలు ఇవ్వాలన్నారు. దేశానికి వ్యవసాయం ఎంతో కీలకమని, వ్యవసాయం తక్కువైతే ఆహార కొరత ఏర్పడుతుందని మంత్రి ప్రస్తావించారు.
Share your comments