తెలంగాణాలో పేద ప్రజలకు సొంత స్థలం ఉండి ఇల్లు లేని వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆర్ధిక మంత్రి హరీష్ రావు తెలంగాణలో ఒక్కొక నియోజకవర్గం నుంచి 2 వేల మంది లబ్ధిదారులను ఎంచుకుని, రూ. 3 లక్షల చొప్పున వారి ఇంటి నిర్మాణానికి ఆర్ధిక సహాయం చేయనున్నట్లు తెలంగాణ అసెంబ్లీ 2023-24 ఆర్ధిక సంవత్సర వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. తెలంగాణలో మొత్తానికి 119 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ విధంగా పేదలకు ఆర్ధిక సహాయం చేసి వారి సొంత ఇంటి కలను నెరవేర్చుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం తోడ్పడుతుంది.
దీనితో పాటు మరో 25 వేల మందికి ముఖ్యమంత్రి కోటాలో ఆర్ధిక సహాయం చేయబోతున్నామని ఆర్ధిక మంత్రి హరీష్ రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి 7,890 కోట్ల రూపాయలను 2.63 లక్షల మందికి ఆర్ధిక సహాయం చేయనున్నట్లు తెలిపారు. బడ్జెట్లో రూ. 12 వేల కోట్లను డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కొరకు కేటాయించారు. హరీష్ రావు గారు ప్రస్తుతానికి 67,782 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పూర్తయ్యాయి అని ఆయన చెప్పారు. ఇది ఇలా ఉండగా సుమారు 32,218 ఇళ్ల నిర్మాణాలు పూర్తికావొచ్చాయి అని వెల్లడించారు. ఇల్లు లేని నిరుపేదలు తెలంగాణాలో ఉండకుండా చేయటమే ప్రభుత్వ లక్ష్యమని హరీష్ రావు గారు చెప్పారు.
ఇది కూడా చదవండి..
బడ్జెట్ 2023: రూ. 7 లక్షల వరకు ఆదాయంపై పన్ను లేదు
ప్రభుత్వం ఇంత భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి వివిధ శాఖల నుండి ప్రతిపాదనలు భారీగా రావడం ఒక కారణమని చెబుతున్నారు. సర్కారు రూపొందించిన ఈ బడ్జెట్‌ను రాష్ట్ర మంత్రివర్గం ఆదివారం ఆమోదించింది. ప్రగతి భవన్‌లో ఆదివారం ఉదయం 10.30 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీలో దీనిపై చర్చ జరిగింది. శాఖలు, పథకాలవారీగా కేటాయింపులను మంత్రులకు వివరించారు. వారు ఇచ్చిన కొన్ని సూచనలు, సలహాల మేరకు బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు.
ఇది కూడా చదవండి..
Share your comments