తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం 'ఫ్యామిలీ డిజిటల్ కార్డ్స్' పైలట్ ప్రాజెక్ట్‌ను గురువారం ప్రారంభించారు. అన్ని రకాల పథకాలకు ఒకే కార్డు తో ప్రయోజనం చేకూరేలా ,ఒక ఫామిలీ కి ఒకే కార్డు ను పని చేస్తుందని ముఖ్య మంత్రి ప్రకటించారు.
సంక్షేమ పథకాల ప్రయోజనాలన్నీ ఒకే కార్డు ద్వారా అందజేస్తామని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించినట్లు అధికారిక ప్రకటన తెలిపింది.
వివిధ శాఖల ద్వారా అమలవుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ సింగిల్ ఫ్యామిలీ డిజిటల్ కార్డులో భద్రపరుస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.
సంక్షేమ పథకాల ప్రయోజనాలను అర్హులందరికీ వర్తింపజేయాలనే లక్ష్యంతో 'ఒక రాష్ట్రం ఒకే కార్డు' విధానంతో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు ప్రకటించింది.
కుటుంబ డిజిటల్ కార్డులో అందరి ఆరోగ్య వివరాలను కూడా పొందుపరుస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి తెలిపారు. కార్డుల జారీలో సవాళ్లను గుర్తించేందుకు పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఫ్యామిలీ డిజిటల్ కార్డులో కుటుంబ పెద్దగా మహిళను పరిగణిస్తున్నారని తెలిపారు.
Share your comments