వ్యవసాయం చేయడం వల్ల ఎక్కువ పెట్టుబడులు.. తక్కువ లాభాలు రావటంతో చాలా మంది వ్యవసాయం దండగ అని భావించి వారు పడుతున్న కష్టాలు తమ పిల్లల పడకుండా ఉండటం కోసం తమ పిల్లలను ఎంతో కష్టపడి చదివి ఉన్నత ఉద్యోగాలలో కూర్చోబెట్టారు. అయితే ఒకప్పుడు వ్యవసాయం దండగ అన్న వారే నేడు వ్యవసాయం పండగా అనే విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణ అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షా 30వేల వరకు ఉద్యోగాలు కల్పించామని, మరో 50 వేల ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ సిద్ధం చేస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు.ప్రభుత్వం అందిస్తున్నటు వంటి సంక్షేమ పథకాలను ప్రజలు స్వాగతించడం వల్లే వ్యవసాయ రంగంలో కొత్త పుంతలు తొక్కుతుందని సీఎం వ్యాఖ్యానించారు.ప్రస్తుత కాలంలో యువత ఎక్కువగా వ్యవసాయ రంగం వైపు అడుగులు వేయడం వెనుక తెలంగాణ ప్రభుత్వం కృషి ఎంతో ఉందని తెలిపారు.
పారిశ్రామిక, వాణిజ్య,ఐటీ రంగాలు అభివృద్ధి చెందడంతో పాటు వ్యవసాయ రంగం కూడా ఎంతగానో అభివృద్ధి చెందింది.ప్రస్తుత కాల, మాన పరిస్ధితుల్లో యువత తమ నైపుణ్యాలను మరింత మెరుగుపరచుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ యువతకు ఐటీ రంగాల్లో ఉద్యోగాలు లభించే దిశగా తెలంగాణ ప్రభుత్వం యువతకు ప్రత్యేకంగా నైపుణ్య పరిజ్ఞాన అకాడమీని మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లు ఈ సందర్భంగా కెసిఆర్ తెలిపారు.
Share your comments