News

పారా ఒలింపిక్ లో మెడల్ సాధించిన దీప్తి జీవన్‌కు రూ. కోటి నగదు, ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించిన ప్రభుత్వం

KJ Staff
KJ Staff
Telangana CM Revanth Reddy announces Rs one cr cash award, govt job for  Deepthi Jeevanji who got medal in Paralmpics
Telangana CM Revanth Reddy announces Rs one cr cash award, govt job for Deepthi Jeevanji who got medal in Paralmpics

పారిస్ పారాలింపిక్స్ కాంస్య పతకం సాధించిన దీప్తి జీవన్‌జీకి వరంగల్‌లో కోటి రూపాయల నగదు, 500 చదరపు గజాల స్థలంతో పాటు గ్రూప్-2 సర్వీసెస్‌లో సముచితమైన పోస్టును తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి శనివారం ప్రకటించారు. 

ఇటీవల జరిగిన ప్యారిస్ పారాలింపిక్స్‌లో మహిళల 400 మీటర్ల టీ20 కేటగిరీ రేసులో భారత ప్రపంచ ఛాంపియన్ దీప్తి జీవన్‌జీ 55.82 సెకన్లతో కాంస్య పతకాన్ని గెలుచుకుంది.

 21 ఏళ్ల జీవన్‌, ఉక్రెయిన్‌కు చెందిన యులియా షులియార్ (55.16 సెకన్లు) మరియు ప్రపంచ రికార్డు హోల్డర్ అయిన టర్కీకి చెందిన ఐసెల్ ఒండర్ (55.23) తర్వాతి స్థానంలో నిలిచింది

"పారాలింపిక్స్ లో కాంస్య పతకం సాధించి, తెలంగాణ ప్రతిష్ఠను ఇనుమడింపజేసి యువ అథ్లెట్ దీప్తి జీవాంజి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెను అభినందించడంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం తరపున గ్రూప్-2 ఉద్యోగం, రూ.కోటి నగదు బహుమతి, వరంగల్ లో 500 గజాల స్థలం, కోచ్ కు రూ.10లక్షలు బహుమతిగా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాను." సీఎం రేవంత్ రెడ్డి తన ట్విట్టర్ లో రాసారు.

Related Topics

cm revanth reddy

Share your comments

Subscribe Magazine

More on News

More