ఖమ్మం:నీట మునిగిన వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
తెలంగాణ:ఖమ్మం నాయకనిగూడెం దగ్గర దెబ్బ తిన్న రోడ్డు, పాలేరు ఏరు ను పరిశీలించిన తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సోమవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి.
పాలేరు లో తెగిన పాలేరు లెఫ్ట్ కెనాల్ ను ,దెబ్బ తిన్న పంట పొలాలను, ముఖ్య మంత్రి మరియు సహచర మంత్రులు పరిశీలించారు.
ఖమ్మం సింగరేణి పల్లి టోల్ ప్లాజా దగ్గర సీఎం రేవంత్ రెడ్డి కి స్వాగతం పలికిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు కాంగ్రెస్ కార్యకర్తలు.
వర్షాలు తగ్గిన అనంతరం పంట నష్టాన్ని ప్రభుత్వం అంచనా వేసే అవకాశం ఉంది.
ఖమ్మం జిల్లాలో రెండు రోజులలో 50 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. వరదలో చికుక్కున్న వారిని రక్షించడానికి అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నరు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఖమ్మంలోని పలు ప్రాంతాల్లో ప్రజలకు ఊరటనివ్వడం లేదు.
Share your comments