తెలంగాణాలో తిరిగి పుంజుకోవడానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ " హత్ సే హత్ " జోడో యాత్ర నిర్వహిస్తున్నది రోజు నియోజక వారీగా కొనసాగుతున్న ఈ యాత్రలో కాంగ్రెస్ పార్టీ రైతుల సమస్యలను ప్రధాన అంశముగా తీసుకొని ప్రచారం చేస్తుంది .
ఒక వైపు రైతు రుణమాపీ రూ. 2 లక్షలు ఇస్తామని.. గతేడాది మే నెలలో వరంగల్‌లో నిర్వహించిన రైతు గర్జనలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీనే స్వయంగా ప్రకటించారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే రూ. 6 లక్షలు దేశ వ్యాప్తంగా అమలు చేస్తామని ప్రకటించారు. అంతే కాకుండా రైతులకు మేలు చేసేందుకు గాను మరిన్ని పథకాలను అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.
కాంగ్రెస్ రైతులకు కీలక హామీలు:
భూ సేకరణ చట్టం – 2013 పకడ్బందిగా అమలు
ఉపాధి హామీ పథకం పకడ్బందిగా అమలుతో పాటు పని దినాల పెంచడం.
వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతికి అవకాశాలు పెంచడం
ఢైరీ, హార్టికల్చర్, కోళ్ల ఫారాలకు సబ్సిడీలన పెంచడం
కౌలు రైతులకు ఆదుకుంటామని హామీ
ధరణి చట్టాన్ని రద్దు చేసి.. ఇబ్బందుల పడుతున్న రైతులకు విముక్తి కల్పించే విధంగా హామీ.
రైతులు, రైతు కూలీలకు హెల్త్, లైఫ్ ఇన్స్‌రెన్స్ సౌకర్యాలు.
తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్ :పిడుగులు, ఉరుములు తో భారీ వర్ష సూచనా !
కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశ వ్యాప్తంగా రూ. 6 లక్షలు రుణమాఫీ,
రాష్ట్ర పరిధిలో ( కేవలం రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ) రూ. 2 లక్షల వరకు రుణమాఫీ అమలు
పంటలకు మద్దతు గ్యారంటీ చట్టం
వ్యవసాయ కమిషన్ ఏర్పాటు
ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన అమలు.. జాతీయ ఇన్స్‌రెన్స్ కంపెనీలతో ఒప్పందం
రైతు ఆదాయం పెంచేందుకు ఒక చట్టబద్దమైన ప్రణాళిక, వ్యవసాయ ఉత్పత్తుల నిల్వలకు గోదాముల ఏర్పాటు.
Share your comments