హైదరాబాద్ :వరద ప్రాంతాల్లో సహా ముంపుకు గురైన వ్యవసాయ క్షేత్రాలలో కూడా త్వరలోనే కేంద్ర బృందాలు పర్యటిస్తాయని ,తెలంగాణ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మంగళవారం మీడియాతో జరిగిన సమావేశం లో తెలిపారు.
మంగళవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ వరదల్లో చనిపోయిన వారికి ప్రభుత్వం రూ.50లక్షల ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి వరద నష్టంపై సరైన నివేదికలు పంపించాలన్నారు. కోతకు గురైన చెరువులను రాష్ట్ర ప్రభుత్వం వెంటమే పునరుద్ధరించాలన్నారు. పశువులకు అపార నష్టం వాటిల్లిందని... ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు.
కొట్టుకుపోయిన పంటకే కాకుండా.. నీటిలో నానిన పంటకు సైతం నష్టపరిహారం ఇవ్వాలన్నారు. పంట నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం వెంటనే సాయం చేయాలన్నారు. ఇళ్ళు కోల్పోయిన వారికి ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్ళు ఇవ్వాలన్నారు.
కేంద్ర ప్రభుత్వ పెద్దలు దేశ ప్రధాని మోదీ, అమిత్ షాలు ఇద్దరు సీఎంలతో మాట్లాడారని . నష్టం తీరును అంచనా వేసి కేంద్రం ఆదుకుంటోందని స్పష్టం చేశారు.
వరద బాధితులకు మరియు పంట నష్టపోయిన రైతులకు బీజేపీ అండగా ఉంటోందన్నారు. అదేవిధంగా ప్రతిఒక్కరు పార్టీలకు అతీతం గ వరద బాధితులకు సహాయం చేయాలంన్నారు.
మరోవైపు మంగళవారం వరంగల్ , మహబూబాబాద్ జిల్లాలో సీఎం పర్యటించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్న కొంత ఆస్తి నష్టం జరిగిందన్నారు. కొంత ప్రాణ నష్టం జరిగిందని తెలిపారు,వరదలు తగ్గినా తరువాత అంచనా వేసి పరిహారం అందిస్తామన్నారు.
Share your comments