తెలంగాణా ప్రభుత్వం పేదలకోసం డబుల్ బెడ్ రూమ్ పథకాన్ని ప్రారంభించిన క్షేత్ర స్థాయిలో పేదలకు ఎటువంటి ప్రయోజనాలు అందలేదు అయితే గత బడ్జెట్లో రాష్ట్ర బడ్జెట్‌లో ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.12 వేల కోట్లు కేటాయించింది దీని ద్వారా గృహలక్ష్మి అనే కొత్త పథకాన్ని ప్రారంభించనుంది , దీని ద్వారా స్వంతంగా భూమి కల్గి ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే పేదలకు 3 లక్షల ఆర్థిక సాయం అందించనుంది .
సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకోలేని వారు లేదా ఇల్లు ఉండీ కూలిపోయి బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్న నిరుపేదలను ఆదుకునేం దుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. గ్రాంట్‌ను మహిళల పేరుపైనే మంజూరు చేస్తామని క్యాబినెట్ ప్రకటించింది. అందుకే ఈ పథకానికి 'గృహలక్ష్మి' అని నామకరణం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు త్వరలో ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఇల్లు కట్టుకునేందుకు ఒక్కో లబ్ధిదారుకు రూ.3 లక్షల గ్రాంట్ ఇవ్వాలని నిర్ణయించింది. లబ్ధిదారుల ఖాతాల్లో ఒక్కో విడతకు రూ.లక్ష చొప్పున మూడు విడతల్లో రూ.3 లక్షలు జమ చేస్తామని ప్రకటించింది. ఒక్కో నియోజకవర్గం నుంచి 3 వేల మందిని ఎంపిక చేయనున్నారు.
PM కిసాన్: ఆన్‌లైన్‌లో తప్పులను సవరించుకోండి ఇలా!
త్వరలోనే లబ్దిదారులను నియోజక వర్గాల వారీగా గుర్తించే ప్రక్రియను ప్రారంభించనున్నట్లు సమాచారం ఎన్నికలు సమీపిస్తుండడంతో పథకం త్వరలోనే అమలుకానుంది అయితే మూడు దఫాలలో రూ.3 లక్షలు జమ చేస్తామని ప్రకటించింన ప్రభుత్వం ఒక్కో దఫా ఎంత సమయం పడుతుందో ప్రకటించలేదు . ఏది ఏమైనా స్వంత ఇల్లు నిర్మించుకోవాలనుకునే పేదలకు ఏది ఒక మంచి అవకాశం .
Share your comments