ఎన్నికల హామీలో భాగంగా, తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ధాన్యానికి 500 రూపాయిల బోనస్ ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు గడుస్తున్నా ఈ బోనస్ ను అమలు చేయకపోవడంతో ఒక పక్క ప్రతిపక్షం మరోపక్క రైతాంగం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి.
దీనికి స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ బోనస్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది, అయితే ఈ బోనస్ కేవలం సన్న వడ్లకే ఇస్తామని ప్రభుత్వం తెలపడంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలుకూడా ఈ విష్యంపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. తెలంగాణ లోని రైతులు అధిక విస్తీర్ణంలో దొడ్డు వడ్లనే సాగుచేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ప్రభుత్వం సన్నవడ్లకే బోనస్ ఇస్తామని తెలపడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణాలో అధిక శాతంలో ఉత్పత్తయ్యేవి దొడ్డు రకాలు, ఈ రకాలను 80% పండిస్తే, సన్న రకాలను 20 శాతం మాత్రమే పండిస్తారు. సాధారణంగా సన్న వడ్ల రకాల్లో రోగాలు ఎక్కువ, అదే దొడ్డు రకాలైతే అధిక రోగనిరోధక శక్తితో ఉంటాయి కనుక వీటిని సాగుచెయ్యడానికి మొగ్గుచూపుతారు. అంతేకాకుండా దొడ్డు వడ్లలో దిగుబడి శాతం కూడా ఎక్కువ. మొదట అన్నిరకాల వడ్లకు 500 రూపాయిల బోనస్ లభిస్తుందని రైతులు భావించారు, కానీ ఇప్పుడు సన్న రకాలకు మాత్రమే బోనస్ అన్న ప్రభుత్వ నిర్ణయాన్ని రైతులు తీవ్రంగా వెతిరేకిస్తున్నారు.
మరోపక్క అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఇస్తామన్న ప్రకటించిన నష్ట పరిహారం డబ్బులు రైతుల ఖాతాల్లో పడలేదని రైతులు వాపోతున్నారు. మార్చ్ నెలలో 16-24 మధ్య రాష్ట్రంల కొన్ని చోట్ల వర్షం పాతం జరిగి రైతులు పంటలు నష్టపోయారు. దీనిపై వ్యవసాయ నివేదిక తయారుచేసి ప్రభుత్వానికి అందించింది. దీనిపై సమీక్షా జరిపిన ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 10 వేల రూపాయిల నష్టపరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. దీనికోసం మొత్తం 15.81 కోట్ల రూపాయిలు నిధులు కేటాయించింది. రెండు మూడు రోజుల్లోపు డబ్బు రైతుల ఖాతాల్లో పడుతుందని ప్రబుత్వం హామీ ఇవ్వగా ఇప్పటివరకు డబ్బు జమకాలేదు.
Share your comments