News

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త అగ్రికల్చర్ పాలసీ..

KJ Staff
KJ Staff

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.సి.ఆర్. రాష్ట్రంలో సమగ్ర వ్యవసాయ విధానానికి నియంత్రిత పద్దతిలో కార్యక్రమాలు రూపొందించినట్టు తెలిపారు. ఇప్పటి నుండి ప్రభుత్వం సూచించినట్టు రైతులు నియంత్రిత విధానంలో సాగు చేయాలనీ చెప్పారు. ఈవిధముగా వ్యవసాయం చేయడం వలన రైతులకు లాభం చేకూరి చాల మంచి జరుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఇది వరకటిలా రైతులు టామా సొంత నిర్ణయయలతో నచ్చిన పంటలు వేసి నష్టపోవద్దు అని చెప్పరు. స్వయంగా ప్రభుత్వమే రాష్ట్రమంతటా మ్యాప్పింగ్ చేసి ఈ ప్రాంతంలో ఈ పంట వేయాలి అనేది తెలియపరిచి మరియు ఈ విధానం తెలంగాణ రాష్ట్రము అంత అమలు పరిచేలా చర్యలు తీసుకుంటామన్నారు.

తెలంగాణ రాష్ట్రాన్ని వ్యవసాయ రాష్ట్రానిగా మార్చేందుకు అనేక పద్ధతులను అమలులుకి తెస్తామని కే.సి.ఆర్. తెలియజేసారు. తెలంగాణాలో సగటు వర్షపాతం 900 మి.మీ ఉండి , వివిధ రకాల నెలలు ఉండడం వలన వివిధ రకాల పంటలు సమగ్ర వ్యవసాయ విధానంతో పండించవచ్చు అన్నారు. తెలంగాణలో ప్రకృతి వైపరీత్యాలు అయిన వరదలు, తుఫాను, వంటివి అరుదుగా వస్తాయి కాబట్టి ఇక్కడ పంటలకు ఎక్కువ నష్టము జరగదు. అందుకే తెలంగాణ రికార్డు స్థాయిలో పంట ఉత్పత్తులు చేస్తుంది అని అన్నారు.

రాష్ట్రం అంతటా 5 వేల ఎకరాల చొప్పున 2604 క్లష్టర్స్ ను సామగ్ర వ్యవసాయ విధానం కొరకు రావతు చేశామని ముఖ్యమంత్రి తెలియజేసారు. ఇప్పుడు వచ్చే వర్షాకాలంలో సామగ్ర వ్యవసాయ విధానాన్ని అమలుచేసి 70 లక్షల ఎకరాల్లో పత్తి, వరి 40 లక్షల ఎకరాల్లో, కంది 15 లక్షల ఎకరాల్లో పండించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ పంటలతో పాటు బత్తాయి, మామిడి వంటి తోటలు కూడా సాగు చేస్కోవచ్చు అని తెలిపారు.

ఇది కూడా చదవండి..

తడి - పొడి విధానంతో వరి సాగులో నీటి యాజమాన్యం

రైతులు ఇష్టమొచ్చిన పంటలు వేయకుండా ప్రభుత్వం సూచించిన మరియు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను పండించి లాభాలు పొందామన్నారు. గతేడాది రెండు పంటలు కలిపి 1కోటి 23 లక్షల ఎకరాల్లో సాగు జరిగిందని.. ఈసారి మరో 10లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం పెరగవచ్చునని చెప్పారు. నియంత్రిత వ్వవసాయ విధానంలో ఏ రకాలు ఎక్కడ సాగుచేయాలో ప్రభుత్వమే చెబుతుందని.. దాని ప్రకారమే రైతులు పంటలు వేయాలని చెప్పారు.

రైతులకు రైతు బంధు అందాలంటే ప్రభుత్వం సూచించిన పంటలు మాత్రమే సాగు చేయాలనీ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్‌తో పోటీపడేలా రాష్ట్రంలో పండించే వరి గింజలు 6.3మి.మీ పైబడి ఉండేలా చర్యలు తీసుకోబోతున్నట్టు తెలిపారు.

ఇది కూడా చదవండి..

తడి - పొడి విధానంతో వరి సాగులో నీటి యాజమాన్యం

Related Topics

agriculture policy

Share your comments

Subscribe Magazine

More on News

More