News

Telengana: రైతు బంధుపై ప్రభుత్వం కీలక నిర్ణయం... వరి రైతులకు 500 రూ బోనస్.....

KJ Staff
KJ Staff

రైతు బంధు పంపిణీలో కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని కీలక మార్పులు తీసుకువస్తుంది. గత ప్రభుత్వ హయాంలో పేరు మీద భూమి ఉన్న ప్రతి ఒక్కరికి రైతు బంధు అందేది. వారి భూమిలో సాగు చేసిన చెయ్యకపోయినా రైతు బంధు డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేవి. అయితే ఈ పరిస్థితికి చెక్ పెట్టె విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నియామకాలను రూపొందిస్తుంది.


ఇక నుండి భూమిలో సేద్యం చేసే వారికీ మాత్రమే రైతు బంధు ఇచ్చేటట్లు కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తోంది. గత ప్రభుత్వం ఎంత భూమి ఉంటె అంత భూమికి రైతు బంధు డబ్బులు జమ చేసేది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధుకు పరిమితిని విధించబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటినుండి ఐదు ఎకరాలు లేదా పది ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు మాత్రమే రైతు బంధు వచ్చే అవకాశం ఉంది. రైతు బంధు పంపిణి మాత్రం పాత విధానంలోనే కొనసాగనుంది.

గత ప్రభుత్వం లాగా, రైతు బంధు పొందే అర్హత లేని వారికీ కూడా రైతు బంధు ఇచ్చి ప్రజల సొమ్మును వృధా చెయ్యబోమని, వ్యవసాయ శాఖ మంత్రి. తుమ్మ నాగేశ్వర్రావు తెలిపారు. వచ్చే సీసన్ నుండి వరి పంటకు క్వింటాల్ కు 500రూ బోనస్ గా ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. ప్రజలు కూడా సేద్యం చేస్తేనే రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేస్తునందున, పంట సాగు చేసే రైతులకు మాత్రమే రైతు బంధు ఇస్తామని తుమ్మల స్పష్టం చేసారు.

తెలంగాణాలో ఇప్పటివరకు 69 లక్షల రైతులకు 5,574 కోట్ల రూపాయల రైతు బందును వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు నాగేశ్వరరావు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ ప్రకారం, రైతుల రుణమాఫికి కసరత్తు చేస్తున్నారు. అలాగే ఈ ఏడాది ఏప్రిల్ చివరిలోగా రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బు జమ చేస్తామని తుమ్మల తెలిపారు.

  • Read More:

  • దక్షిణ మధ్య రైల్వే ఖాతాలో మరో కీలక రికార్డ్.......

  • నేటి నుండి ఆంధ్ర ప్రదేశ్లో పింఛన్ల పంపకం షురూ.....

Share your comments

Subscribe Magazine

More on News

More