రైతు రుణమాఫీకి సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రంగం సిద్ధమయ్యింది. రైతులకు లాభం చేకూర్చాలన్న ఉదేశ్యంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభిస్తున్న రైతు రుణమాఫీకి సంబంధిచిన విధివిధానాలను మంగళవారం విడుదల చెయ్యనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని నేలలు పూర్తికావొస్తున్న ఇంకా రుణమాఫీ చెయ్యలేదని ఒక పక్క ప్రతిపక్షాలు మరోపక్క రైతులు ఇప్పటికే ప్రభుత్వాని ప్రశ్నిస్తుండగా, ఈ నిరీక్షణకు రేపటితో తెరపడనుంది.
అయితే ఇప్పటికే రైతురుణమాఫీ చెయ్యవలసి ఉంది అయితే మార్చ్ నుండి ఎన్నికల కోడ్ అమలులో ఉండడం వలన ఈ పథకం ప్రారంభించడంలో ఆలస్యం అయ్యిందని, ఎట్టిపరిస్థితుల్లోనూ ఆగష్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఈ పథకం ప్రకారం 2 లక్షల రుణాలను మాఫీ చేస్తామని తెలిపారు. ప్రతి కుటుంబానికి రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోని రుణమాఫీ అమలు చెయ్యనున్నారు. ఈ పథకం కోసం మొత్తం 31 వేల కోట్ల రూపాయిల నిధులను ఖర్చు చెయ్యనున్నారు. ఈ పథకం అమలు చెయ్యడం మీద పూర్తి సమీక్ష జరిపిన ప్రభుత్వం దీనికి సంబంధిన మార్గదర్శకాలను పూర్తిచేసింది. అంతేకాకుండా ఈ పథకం ఎవరికీ అమలుచేయాలి అన్న అంశం మీద కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది.
రుణమాఫీకి సంబంధించిన విధివిధానాలకు రూపకల్పన చేసి, ఆగష్టు 15 లోపు రైతు రుణమాఫీ చెయ్యాలని ఆర్ధిక మరియు వ్యవసాయ శాఖ అధికారాలు కసరత్తు చేస్తున్నారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చెయ్యడానికి మొత్తం 31 వేల కోట్లు అవసరమని అధికారాలు తేల్చగ, ఈ నిధులు సమీకరించడానికి ఆర్ధిక శాఖ అధికారాలు దృష్టి సారించారు. నిధులు సమకూర్చడానికి అధికారు అన్ని మార్గాలను పరిశీలిస్తున్నారు, కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి అవసరమైన నిధులను రుణం తీసుకోవాలి అని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.
రైతు రుణమాఫీలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అర్హులైన రైతులందరికి రుణమాఫీ అందేలా అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ పథకం పొందడానికి కొన్ని షరతులు కూడా వర్తింపచేస్తున్నారు. రేషన్ కార్డు ప్రాతిపదికన ఈ పథకం అమలవుతుంది కాబట్టి, కుటంబంలో ఎంతమంది రుణం తీసుకున్న గరిష్టంగా 2 లక్షల రుణం మాత్రమే మాఫీ అవుతుంది. పీఎం కిసాన్ పథకంలోని కొన్ని నిబంధనలు, రుణమాఫీకి కూడా వర్తింపచేయనున్నారు. అయితే రాజ్యాంగ బద్దమైన పదవుల్లో ఉన్నవారు, ప్రజా ప్రతినిధులు మరియు ఐటి చెల్లించే వారు ఈ పథకానికి అనర్హులుగా ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. పాస్ బుక్ జత చేసి బంగారం కుదువపెట్టి తీసుకున్న రుణాలకు ఈ రుణమాఫీ వర్తించబోదు. రుణమాఫీ అమలులో విధి విధానాల అమలుపై, ఉన్న ఉత్కంఠకు రేపటితో తెరపడనుంది.
Share your comments