తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా అందించే పథకం రైతు బందు , రైతులకు రెండు దఫాలుగా సంవత్సరానికి ఎకరానికి రూ . 10000 చోపున్న అందించే ప్రభుత్వం ఇప్పటివరకు రైతుబంధు పేరిట తెలంగాణ వ్యాప్తంగా 10 విడతలలో 70 లక్షలకు పైగా రైతుల ఖాతాలలో రూ.65,000 కోట్లు జమచేసింది .
రైతులు నష్టాల ఊబిలో కురుకుపోకుండా రైతులకు పెట్టుబడి సాయం అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చి నేటికీ 5 సంవత్సరాలు . మొదట్లో ఎకరాకు సంవత్సరానికి 8 వేళా చొప్పున పెట్టుబడి సాయం అందించిన ప్రభుత్వం తరువాత ఏడాది తర్వాత దీన్ని రెండు విడుతల్లో ఏకరాకు రూ.10 వేలకు పెంచారు. ప్రతి సీజన్‌లోనూ సుమారు 65 లక్షల మంది రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తున్నారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతుకు ఎన్ని ఎకరాల భూమి ఉంటే అన్ని ఎకరాలకు ప్రతి ఎకరానికి రూ.10 వేల చొప్పున పంపిణీ చేస్తున్నారు.
ఫిబ్రవరి 25, 2018న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరిగిన రైతు సమన్వయ సమితి సదస్సులో ఆయన ఈ పథకాన్ని ప్రకటించారు. కరీంనగర్‌లోని ధర్మరాజ్‌పల్లి గ్రామంలో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించే ముందు అదే సంవత్సరం బడ్జెట్‌లో రూ.12,000 కోట్లు కేటాయించారు.
ఇది కూడా చదవండి .
SSC Results: తెలంగాణ లో 25 స్కూల్స్ లో సున్నా ఉతీర్ణత శాతం! ఇది విద్య వ్యవస్థ వైఫల్యమేనా?
ఈ పథకం కింద ఇప్పటివరకు 10 విడతలు పంపిణీ చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సహాయం అందించింది. ఈ ఏడాది యాసంగిలో 63.97 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చగా 144.35 లక్షల ఎకరాలకు రూ.7,217.54 కోట్లు సాయంగా విడుదల చేశారు.
ఇది కూడా చదవండి .
Share your comments