మంగళవారం జరిగిన ఆరోగ్య శ్రీ బోర్డు సమావే శంలో మాట్లాడుతూ ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచినందున కొత్తగా లబ్దిదారులకు ఆరోగ్య శ్రీ డిజిటల్ కార్డులు అందించాలని వీటికి సంబందించిన e-kyc ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు.
నిమ్స్ స్పెషలిస్టులతో ఆరోగ్య శ్రీ కేసులను మెడికల్ ఆడిట్ చేయించాలని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు. కరోనా టైంలో రికార్డు స్థాయిలో 856 సర్జరీలు చేసిన కోఠి ఈఎన్టీ హాస్పిటల్కు రూ.1.30 కోట్ల ప్రోత్సాహకం ఇవ్వాలని నిర్ణయించామన్నారు.
రైతులకు ముఖ్య గమనిక.. ఈ నెల 10 నుండి 'రైతు బీమా' పథకానికి దరఖాస్తులు ప్రారంభం..
మూగ, చెవిటి పిల్లలకు సర్జరీ సేవలను అందుబాటులో తెచ్చేందుకు కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. డయాలసిస్ సేవలను మరింత నాణ్యతతో అందించేందుకు ప్రత్యేక విధి విధానాలు రూపొందించనేదుకు అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు. ఆరోగ్య శ్రీ రోగులకు త్వరలో ఫేస్ రికగ్నైజేషనే ను వినియోగించనున్నట్లు తెలిపారు.
Share your comments