News

తెలంగాణ రైతులకు శుభవార్త.. కేసీఆర్‌ కీలక నిర్ణయం.. యాసంగి వడ్ల మద్దతు ధర ఇదే !

Srikanth B
Srikanth B
CM KCR
CM KCR

తెలంగాణాలో యాసంగి వడ్ల కోతలు మొదలయ్యాయి ఏప్రిల్ నుంచి ప్రారంభం అయ్యే ఈ కోతలు మే మొదటి వరం వరకు కొనసాగుతాయి అయితే ముందుగా నాట్లు వేసిన రైతులు ఇప్పటికే కోతలు కూడా ప్రారంభించారు .అహర్నిశలు శ్రమించి పండించిన పంటను దళారులకు అమ్మి నష్టపోకుండా రైతుల నుంచి నేరుగా ప్రభుత్వం ధాన్యం సేకరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈమేరకు యుద్ధప్రాతిపదికన కొనుగోలు కేంద్రాలు తెరవాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సీఎస్‌ శాంతి కుమారికి సూచించారు.

మద్దతు ధర అందించేందుకు ప్రభుత్వం ఏటా దాదాపు 7వేలకుపైగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం సేకరిస్తున్నది. ధాన్యానికి సంబంధించిన డబ్బులను ఆయా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సారి గ్రేడ్‌ వన్‌కు రూ.2060, సాధారణ రకానికి రూ.2040 ధరను ప్రభుత్వం ప్రకటించింది.

ఇప్పుడు కుటుంబం లో ఇద్దరికి పీఎం కిసాన్ డబ్బులు .. వార్త పై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం!

ఈ సీజన్‌లో 7వేల కొనుగోలు కేంద్రాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి సూచించారు. కొనుగోళ్ల విషయంలో సోమవారం జిల్లా కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు.

ఇప్పుడు కుటుంబం లో ఇద్దరికి పీఎం కిసాన్ డబ్బులు .. వార్త పై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం!

Related Topics

Telangana govt Scheme

Share your comments

Subscribe Magazine

More on News

More