తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ త్వరలోనే రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందనట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఐఈఆర్, పీఆర్సీ పై త్వరలోనే ప్రకటనలు రానున్నట్లు తెలిపారు. వీటి పట్ల సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని.. ఉద్యోగులు, జేఏసీ నేతలకు వెల్లడించారు.
హైదరాబాద్‌లో ఆదివారం ఉద్యోగుల జేఏసీ సమావేశం నిర్వహించింది ప్రభుత్వం. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను ఈ సమావేశానికి వచ్చి, ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపారు. ఇటీవల అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్, తనకు మధ్య జరిగిన సమావేశాన్ని గుర్తు చేసుకుంటూ, పీఆర్‌సీ (పే రివిజన్ కమిషన్), ఐఈఆర్ (ఇంటీరిమ్ ఎన్‌హాన్స్‌డ్ రిలీఫ్) కీలకమైన అంశాలపై చర్చించే సమయంలో గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించారని, శాసనసభావేదికగా ప్రకటించారని గుర్తు చేశారు.
జేఏసీ చైర్మన్ మామిళ్ల రాజేందర్, సెక్రటరీ జనరల్ వీ మమత పలు సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్‌తో కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు. ఉద్యోగుల సేవలను అసెంబ్లీ వేదికగా గుర్తుచేసి ఈహెచ్‌ఎస్, ఐఆర్, పీఆర్సీలపై ప్రకటించినందుకు సీఎం కేసీఆర్‌కు వారు ధన్యవాదాలు తెలిపారు.
ఇది కూడా చదవండి..
పెన్షన్ల పెంపుపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన..
ఈ ప్రత్యేక కార్యక్రమంలో, నాయకులు తమ అచంచల విధేయతను ప్రదర్శిస్తూ సీఎం కేసీఆర్‌కు పూర్తి మద్దతుగా ఉంటామని తెలిపారు. ఈ సమావేశంలో టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్, టీజీఓ ప్రధాన కార్యదర్శి ఎ సత్యనారాయణ, పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పింగిళి శ్రీపాల్ రెడ్డి, బీరెల్లి కమలాకర్ రావు, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం జ్ఞానేశ్వర్, కృష్ణ యాదవ్, వెంకట్, ఖాదర్, తదితరులు పాల్గొన్నారు. మంత్రి మాటలు విన్న ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి..
Share your comments