తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించనుంది గ్రూప్-4 ఉద్యోగాలకు సంబంధించి ఓ కీలక విషయాన్ని తెలియజేసింది. రాష్ట్రంలో ఆయా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 9,818 గ్రూప్-4 ఖాళీలను ఒకే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని యోచిస్తోంది.
ఈ గ్రూప్-4 ఉద్యోగాలకు సంబంధించి తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ టీఎస్పీఎస్సీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమీక్షలో భాగంగా దీర్ఘకాలం తర్వాత గ్రూపు-4 పోస్టులు భర్తీ అవుతున్నందున వాటికి సంబంధించిన విద్యార్హతలు, వయసు, దరఖాస్తు రుసుము, పరీక్ష విధానం ఇతర అంశాలపై చర్చించారు. పబ్లిక్ సర్వీసు కమిషతోపాటు ఇతర నియామక సంస్థల నుంచి సలహాలు తీసుకున్నారు. అన్నింటిని క్రోడీకరించి దస్త్రంగా రూపొందించి, కేసీఆర్ ఆమోదానికి పంపించారు. మరో నాలుగు లేదా ఐదు రోజుల్లో కేసీఆర్ ఆమోదం తెలిపిన వెంటనే గ్రూప్ -4 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలవడనున్నట్లు సమాచారం
తాజా ప్రతిపాదనల లను ముఖ్యమంత్రి ఆమోదానికి పంపించారు. గ్రూప్-4 కింద భర్తీ చేయనున్న వాటిలో జూనియర్ అసిస్టెంట్లు, జూనియర్ స్టెనోలు, టైపిస్టులు, అకౌంటెంట్లు తదితర ఉద్యోగాలు ఉన్నాయి. అన్ని జిల్లాల్లో శాఖాధిపతుల కార్యాలయాల్లో కింది స్థాయిలోని ఈ పోస్టులు చాలా కాలంగా ఖాళీగా ఉండడంతో పరిపాలన పరమైన సమస్యలు ఏర్పడుతున్నాయి. కావున వీటిని త్వరగా భర్తీ చేయాలని ప్రభుత్వం కసరత్తులు ముమ్మరం చేసింది.
Share your comments