గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న విద్యార్థులకి నాణ్యతమైన విద్యని అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం గురుకుల పాఠశాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేస్తుంది. దీనికి సంబంధించి 2022-23 విద్య సంవత్సరానికై ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.
- దరఖాస్తు కి చివరి తేదీ:28 మార్చ్ 2022.
దరఖాస్తు రుసుము :రూ.100.-
పరీక్ష నిర్వహించు తేదీ: 8 మే 2022.
సమయం :ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు(పూర్తి సమయం 2 గంటలు).
4వ తరగతి చదువుతున్న విద్యార్ధి,విద్యార్థినులు మాత్రమే దరఖాస్తు చేయడానికి అర్హులు.
విద్యార్థులు తమ అర్హతలు అన్నింటిని పరిశీలించుకుని జాగ్రత్తగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోండి.- పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 2 లక్షల లోపు ఉండాలి, గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న వారిది రూ 1.5 లక్షల లోపు ఉండాలి.
దరఖాస్తు చేయడం ఎలా:
ముందుగా ఆన్ లైన్ లో తెలంగాణ గురుకుల పాఠశాలల అధికారక వెబ్సైటు(tgcet.cgg.gov.in) లోకి వెళ్ళండి
అక్కడ కింద నోటిఫికేషన్ (notification ) అనే లింక్ ని నొక్కండి
ఆ తరువాత కుడి వైపున సర్వీసెస్ (services) విభాగం లో ఆన్ లైన్ పేమెంట్ లింక్(online payment link ) మరియు ఆన్ లైన్ అప్లికేషన్ లింక్ (online application link) ఉంటాయి.
వాటి ద్వారా పూర్తి వివరాలు నమోదు చేసుకొని రూ 100 రుసుము చెల్లించి దరఖాస్తుని ప్రక్రియని పూర్తి చేయవచ్చు.
చివరగా అప్లికేషన్ పామ్ ని భవిష్యత్తు అవసరకాలకై download చేసుకోండి.
ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణలో ఏవైనా సమస్యల పరిష్కారం కోసం కింద సూచించిన ఫోన్ నంబర్లను సంప్రదించండి
ఫోన్ : 040-23120431, 040-23120432
(కాల్ సమయం : 10.30 A.M నుండి 1.00 P.M &
పని దినాలలో 02.00 P.M నుండి 05.00 P.M
Share your comments