తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల భారీ వర్షాలు మరియు వరదల కారణంగా మొత్తం నష్టం రూ. 10,000 కోట్లకు పైగా వాటిల్లిందని
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి నిన్న తెలిపారు.
రాష్ట్రంలోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందంతో సీఎం సమావేశమై వరద సహాయక చర్యల కోసం కేంద్రం నుంచి తక్షణమే నిధులు విడుదల చేయాలని కోరారు.
"ఇటీవల సంభవించిన వరద నష్టం పై సచివాలయంలో కేంద్ర బృందంతో భేటీ కావడం జరిగింది. ఎలాంటి నిబంధనలు లేకుండా తక్షణ సాయంగా నిధులు విడుదల చేయాలని కోరాను.మున్నేరు వాగుకు రిటైనింగ్ వాల్ నిర్మించడం వరద నివారణకు శాశ్వత పరిష్కారమవుతుందని కేంద్ర బృందానికి వివరించాను." అని రేవంత్ రెడ్డి ట్విట్ చేశార
రాష్ట్రంలో మూడు రోజుల కురిసిన వర్షాలు, వరద తాకిడికి గురైన ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక అంచనాల ప్రకారం వరద నష్టం రూ.5,438 కోట్లుగా పేర్కొంది.
ఈ నెల ప్రారంభంలో రాష్ట్రంలో భారీ వర్షాలు మరియు వరదల కారణంగా 29 మంది ప్రాణాలు కోల్పోయారు.
Share your comments