సాధారణంగా పిల్లలకి దిష్టి తగులుతుందని అమ్మలు చెంపల దగ్గర లేక కాళ్ళ కింద దిష్టి చుక్క పెడతారు నర దిష్టి తగలకుండా మరి అలాంటిది తన పొలాన్ని బిడ్డలా చూసుకుంటున్న ఒక రైతుకి దానికీ నర దిష్టి తగులుతుందేమోనని అనుమానం వచ్చింది. నర దిష్టి తగలకుండా ఉండటానికి ఒక ఉపాయాన్ని ఆలోచించాడు దానిని అమలులో పెట్టాడు కూడా. ఇది మీకు ఖచ్చితంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
వ్యవసాయంలో రోజూ వేలాది ప్రయోగాలు జరుగుతున్నాయి.శాస్త్రవేత్తలు లేదా పరిశోధకులు సంవత్సరాల తరబడి వ్యవసాయ అభివృద్ధికై పరిశోధనలు చేస్తున్నారు ఒక్కోసారి వ్యవసాయ క్షేత్రంలో రైతే పరిశోధకుడిగా మారుతాడు అలాంటి సంఘటనే ఇప్పడు చోటు చేసుకుంది.
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే రైతు తన తొమ్మిదెకరాల్లో నాణ్యత తో పంట సాగు చేస్తున్నాడు. ఇతను ముఖ్యంగా బొప్పాయి పంటను వేసి అందులో అంతర పంటలుగా బంతి, దానిమ్మ వంటి పూలు, పండ్ల పంటలు వేశాడు. దట్టంగా పెరిగిన బొప్పాయి పంట అందరిని విపరీతంగా ఆకర్షిస్తుంది అయితే గ్రామ రైతులే కాకుండా చుట్టూ పక్కల జనాలు కూడా శ్రీనివాస్ రెడ్డి పంట విధానాలని తెలుసుకోవడానికి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శిస్తున్నారు.
మొదట దీనికి ఆనంద పడ్డ రైతు నిరంజన్ రెడ్డి తర్వాత జనాల తాకిడి ఎక్కువ అవ్వడం తో ఎక్కడ పంటకి దిష్టి తగులతుందో అని పంట పొలంలో అక్కడక్కడ నటీమణుల ఫోటోలని ప్లేక్సీల రూపంలో ఏర్పాటు చేసాడు నర దిష్టి తగలకుండా అదే సమయంలో పక్షులు, జంతువుల బెడద నుండి కాపాడటానికి ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించాడు. తమన్నా, కాజల్ అగర్వాల్ మరియు పూజ హెగ్డే వంటి తార మణుల ప్లేక్సీలను పెట్టాడు, అయితే ఈ విషయం ఇప్పుడు ఇంకా వైరల్ గ మారి మరింత మంది సందర్శకులు వస్తున్నారు.
మరిన్ని చదవండి:
Share your comments