News

TELANGANA PADDY : ఈ యాసంగి "తెలంగాణ "లో దాదాపు 30 లక్షల ఎకరాల్లో వరిసాగు !

Srikanth B
Srikanth B

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ   లు వరి  కొన్నామని నిర్ణయం ప్రకటించిన తరువాత   రైతుల్లో కొంత అసహనం  ఏర్పడింది. తెలంగాణ ప్రభుత్వం కూడా వరి సాగు చేయవద్దని వరి విత్తనాలు  అమ్మే డీలర్లపై కఠినచర్యలు తీసుంటామని వెల్లడించింది ,అయినప్పటికీ రబీ సీజన్ లో వరి సాగు  విస్తీర్ణం 31 లక్షల ఎకరాలకు చేరుకుంది. వరి సాగు  ఈసారి15 నుండి 20 లక్షల ఎకరాలకు తగ్గుతుందని ప్రభుత్వం ఆశించింది  కానీ రైతులు ఏ మాత్రం బెదురు లేకుండా సాగుచేశారు .

మొదట్లో  రైతులలో కొన్ని  సందేహలు ఉన్నపటికీ చివరికి వరి సాగు వైపే మొగ్గు చూపరు  గత పంట తో పోలిస్తే వరి సాగులో స్వల్ప తేడా తప్ప పెద్దగా లేదు . ఈసారి రైతులు నుంచి బొయిల్డ్ రైస్ తీసుకోబోమని ప్రభుత్వాలు చేపిన రైతులు మాత్రం సాధారణంగ ప్రతి సంవత్సరము  లాగానే సాగు చేసారు . అయినప్పటికీ రబీ సీజన్ లో వరి విస్తీర్ణం 31 లక్షల ఎకరాలకు కాగా  ఇది గత ఏడాది 49 లక్షల  ఎకరాలుగా వుంది .

వరి సాగు  గణనీయంగా తగ్గుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఊహించింది. కానీ తాజా సమాచారం ప్రకారం, 31 లక్షల ఎకరాల్లో వరి నాటబడిందీ ,నిషేధం ఉన్నప్పటికీ రైతులు వరి ని ఎందుకు సాగు చేశారు? ఈ ప్రశ్నకు సమాధానంగా బిజినెస్ లైన్ తో మాట్లాడుతూ, దక్షిణ భారత మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు టి దేవేంద్ర రెడ్డి, వరి ఎల్లప్పుడూ రైతులకు సురక్షితమైన ఎంపిక అని అన్నారు. ఖచ్చితమైన ఆదాయాన్ని అందించే ఏకైక పంట ఇది. అయితే, మార్కెట్ లో డిమాండ్ ఉన్న రకాలను సాగు చేయాలని అయన అన్నారు .

అదే సమయంలో ఒక వ్యవసాయ శాస్త్రవేత్త మాట్లాడుతూ, వరి రైతు ఇతర పంటలకు మారడం అంత సులభం కాదని అన్నారు. వరిసిద్ధంగా ఉన్న పొలాలు ఇతర పంటలకు వెంటనే సరిపోవు. దీనికి 2-3 సంవత్సరాలు పడుతుంది.

Share your comments

Subscribe Magazine

More on News

More