హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే ADEx - అగ్రికల్చర్ డేటా ఎక్స్చేంజి అనే ఒక కొత్త నివేదికను ఆవిష్కరించనుంది. ఇది ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ( A.I ) ద్వారా నడిచే ఒక వ్యవసాయ సమాచార వేదిక అన్నమాట.
వ్యవసాయ రంగం లో కొత్త ఆవిష్కరణలు తీసుకురావాలని ప్రయత్నిస్తున్న అన్ని సంస్థలకు, లేదా స్టార్టుప్ లకు ముందుగా ఎదురయ్యే ప్రధాన సమస్య, అవసరమైన సమాచారం ఎక్కడ దొరకకపోవడం. ఉదారణకి , ఒక నేల లో ఎంత పంట పండించొచ్చు, వర్షపాతం ఎంత, ఎలాంటి నీటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి, ఎంత మంది రైతులు వ్యవసాయం లో ఉన్నారు, ఆయా ప్రాంతాల యొక్క సమాచారం కావాలి అంటే వేర్వేరు చోట్ల నుండి తీసుకోవాల్సి వేచేది.
ఇది కూడా చదవండి
ఒక్క మామిడి పండు ధర రూ. 19,000/- ప్రపంచంలోనే ఖరీదైన రకం, ఏదో తెలుసా?
ఈ సమస్యను పరిష్కరించాడనికై, వ్యవసాయ రంగానికి సంబంధించిన మొత్తం సమాచారం ఒకే వేదిక పై దొరికేలా చేయడానికి ఈ టెక్నాలజీని సృష్టించారు. ఈ ప్రాజెక్ట్ కోసం తెలంగాణ ప్రభుత్వం, ప్రపంచ ఆర్ధిక ఫోరమ్ (WEF) మరియు ఇండియన్ ఎకనామిక్ సైన్స్ (IISC) సహకారం తో పనిచేయనుంది.
మాములు వెబ్సైటు లకు ఈ ప్రాజెక్ట్ కు తేడా ఏంటంటే, వీటిలో ఉండే ప్రతి వ్యవసాయ సంబంధిత సమాచారం సిస్టం లో నిక్షిప్తం చేయబడుతుంది. రైతులు కానీ, స్టార్టుప్ సంస్థలు కానీ, పరిశోధనలు చేసే విద్యార్థులు కానీ వ్యవసాయానికి సంబందించిన సమాచారం కోసం ఈ పోర్టల్ ను సందర్శిస్తే , ఆయా యజమాని అంగీకారం ప్రకారం సమాచారాన్ని వారు పొందవచ్చు. ప్రజల అభువృధి, జీవన శైలి మెరుగుపరచడానికి మరిన్ని ఆవిష్కరణలు అందుబాటు లోకి తీసుకురడానికి ప్రభుత్వం ఎల్లపుడు ఆసక్తికరం గానే ఉంటుందని అధికారులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి
Share your comments