News

ఒక్క మామిడి పండు ధర రూ. 19,000/- ప్రపంచంలోనే ఖరీదైన రకం, ఏదో తెలుసా?

Sriya Patnala
Sriya Patnala
Most expensive japanese mango one costs 19000 approx, know why
Most expensive japanese mango one costs 19000 approx, know why

వేసవికాలం లో మనం రకరకాల మామిడి పళ్ళను తింటూ ఉంటాం, అయితే మన దగ్గర ఎంత ఖరీదైన మామిడి పెళ్లైన మహా ఐటితే 500/- లకు మించదు. కానీ జపాన్ కు చెందిన ఈ మామిడి పండు ధర మాత్రం ఒక్కోటి దాదాపు రూ. 19,000 అంటే నమ్ముతారా?

ఈ మామిడి పండ్లను జపాన్ లోని తోకాచి జిల్లాలో 2011 నుండి, హిరోయుకి నకగావా అనే రైతు శీతాకాలం లో కూడా, ఒక ప్రత్యేక పద్దతిలో
మామిడి పళ్ళను పండించి ఒక్కోటి దాదాపు రూ.19,000కు విక్రయిస్తున్నాడట .సాంప్రదాయ మామిడి పండ్ల కంటే ఇది ఎన్నో రేట్లు తియ్యగా ఉంటుంది, దాదాపు 15 డిగ్రీల బ్రిక్స్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుందట .

ఈ మామిడి పండుకి "హకుగిన్ నో తైయో" అని పేరు పెట్టాడు , అంటే "మంచు లో సూర్యుడు" అని అర్ధం అన్నమాట.

శీతాకాలం లో కూడా ఎలా పండిస్తున్నాడు?

ఈ రైతు గ్రీన్‌హౌస్‌లో మామిడి పళ్ళను పండిస్తున్నాడు. అంటే కటిక చలి ఉండే డిసెంబర్ నెలలో, బయట ఉష్ణోగ్రత -8C ఉన్నప్పటికీ గ్రీన్‌హౌస్ లోపల ఉష్ణోగ్రత 36C వద్ద ఉంటుంది. ఇలా చేయడం ద్వారా మామిడి పండ్లు పూతరాడానికి సహజ వాతావరణం సృష్టించి, ఆఫ్-సీజన్ లో కూడా మామిడి పెంచుతున్నాడు. అయితే ఈ పద్దతిలో 5,000 మామిడి పండ్లను మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయట.అందుకే ఒక్కో దానికి అంత రేటేమో !

దీనికి ముందు అయన పెట్రోల్ కంపెనీ నడిపేవాడట . ఆ తర్వాత మామిడి సాగుపై దృష్టి సారించాడు. ఆ తర్వాత ఒక అనుభవజ్ఞుడైన మామిడి రైతు సహాయంతో నోరావర్క్స్ జపాన్ అనే స్టార్ట్-అప్ కంపెనీని స్థాపించాడు. చలికాలంలోనూ మామిడి సాగు చేయవచ్చని కనుగొన్న ఈ రైతుకి ,తన మామిడి పల్లకి ఇప్పుడు ప్రపంచమంతా డిమాండ్ అట.

నకగావా యొక్క మామిడి పండ్లలో ఒకటి 2014లో జపనీస్ డిపార్ట్‌మెంట్ రిటైలర్ ఐసెటాన్ ద్వారా ప్రదర్శించబడిందట , అది అక్కడ సుమారు $400కి విక్రయించబడింది.ఈ అధిక ధర మీడియా దృష్టిని ఆకర్షించి, డిమాండ్‌ను మరింత పెంచింది. అధికారిక Nakagawa వెబ్‌సైట్‌లో ఆర్డర్‌లు చేసే కస్టమర్‌లు క్రమం తప్పకుండా "SOLD OUT" అనే నోటీసు చూస్తూనే ఉంటారు.

2022 ఆసియాలోని ఉత్తమ మహిళా చెఫ్ అయిన నట్సుకో షోజీ వంటి ప్రఖ్యాత చెఫ్‌లు నకగావా ఖాతాదారులలో ఉన్నారట . ఈ పంటలో పురుగుమందుల వాడకం లేకపోవడంతో మామిడి ఆకులను మామిడి టీకి ఉపయోగించేందుకు టీ కంపెనీ లుపిసియా ఆసక్తిని వ్యక్తం చేసింది అని ఆయన చెప్పాడు

అతను ఇదే పద్దతిలో పీచ్ వంటి ఇతర వేసవి పండ్లను పండించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. కొత్త పద్ధతులు అలవర్చుకుని, సేంద్రియం గ పంటలు పండిస్తే ప్రపంచం అంతా గుర్తిస్తుందని ఈ రైతు మరోసారి నిరూపించాడు.

ఇది కూడా చదవండి

Neera cafe:పెద్ద హిట్ గా నిలిచిన నీరా కేఫ్, మొదటి వారం లోనే 4 వేల లీటర్ల నీరా అమ్మకం

Share your comments

Subscribe Magazine