News

Neera cafe:పెద్ద హిట్ గా నిలిచిన నీరా కేఫ్, మొదటి వారం లోనే 4 వేల లీటర్ల నీరా అమ్మకం

Sriya Patnala
Sriya Patnala
Hyderabads Neera cafe has become another attraction to telangana
Hyderabads Neera cafe has become another attraction to telangana

తెలంగాణ లో ఈమద్యే ప్రారంభమైన నీరా కేఫ్ పెద్ద హిట్ గా నిలిచింది, హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరాన స్థాపించిన ఈ కేఫ్ , హైదరాబాద్ మరియు చుట్టు పక్కన ప్రాంతాల్లో గొప్ప ప్రజాదరణ పొందుతుంది.

హైదరాబాద్ లో నీరా కేఫ్ మే 3వ తేదీన ప్రారంభించగా, ఇక్కడ రోజుకి 500-600 లీటర్ల నీరు అమ్ముడవుతుంది. తెలంగాణ లోని గీత కార్మికులకు( గౌడ కులం) చేయూతన ఇవ్వాలనే లక్ష్యం తో , తెలంగాణా ఎక్సైజ్ మరియు ప్రివెన్షన్ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ఈ నీరా ఔట్‌లెట్‌ను ప్రారంభించారు.

నీరా కి కల్లుకి తేడా ఏంటి?

నీరా అనేది తెలంగాణాలో, స్థానిక మార్కెట్లలో ఎక్కువగా అమ్ముడవుతున్న పామాయిల్ తాటి యొక్క రసం.పులియబెట్టిన తర్వాత, అది టోడీ అవుతుంది - స్థానికంగా కల్లు అని పిలుస్తారు.
సాధారణంగా, దీనిని పులియబెట్టిన టోడీగా విక్రయిస్తారు. అయితే నీరా కేఫ్‌లో మాత్రం ఇది ఆల్కహాల్ రహితం.

రసం, తాటి గీత కార్మికుల దగ్గర నుండి సేకరించిన తర్వాత, ఐస్ జెల్‌లతో కూడిన కంటైనర్‌కు బదిలీ చేయబడుతుంది.ఐస్ జెల్‌లు పానీయాన్ని కలుషితం చేయకుండా నిరోధించడానికి ఫుడ్-గ్రేడ్ ప్లాస్టిక్ షీట్‌లతో కప్పబడి ఉంటాయి. అవి కిణ్వ ప్రక్రియను నిరోధిస్తాయి

ఇది కూడా చదవండి

కొత్త తరహా పెళ్లి :పశువులు ,పక్షులకు పెళ్లి భోజనాలు !

నీరా కేఫ్‌లో, పానీయం పులియకుండా నిరోధించడానికి -4 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయబడుతుంది.ఇది బయట ఉష్ణోగ్రతలో ఉంచితే కేవలం నిమిషాల్లో కళ్ళు గ మారడం ప్రారంభమవుతుంది. అలా కాకుండా సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేసి విక్రయిస్తున్నారు నీరా కేఫ్ లో.

నీరా కేఫ్ : 175 ml గ్లాస్ నీరా ₹50కి విక్రయించబడుతుండగా, 300 ml బాటిల్ ధర ₹90.

అయితే, మెర్కెట్లో నుండి నేరుగా నీరా కొనుగోలు చేసిన కస్టమర్లు ధర ఎక్కువగా ఉన్నట్లు భావించారు. "ఇక్కడ అందించే నీరా ఫిల్టర్ చేయబడినది మరియు కాలుష్యం లేనిది ,ఇక్కడ అధిక ధర రవాణా ఖర్చు మరియు ఎటువంటి కృత్రిమ పదార్థాన్ని జోడించకుండా భద్రపరిచే ఖర్చు ఫలితంగా ఉంది, ”అని కేఫ్ అధికారి చెప్పారు. నీరా పానీయం నాలుగు రోజుల పాటు నిల్వ ఉంటుంది

హైదరాబాద్ లో నీరా కేఫ్ కు పెరుగుతున్నడిమాండ్ కి అనుగుణంగా కేఫ్ కెపాసిటీ ని రోజుకి 1000 లీటర్ల అమ్మేలా ఏర్పాట్లు చేస్తున్నారని కేఫ్ అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి

కొత్త తరహా పెళ్లి :పశువులు ,పక్షులకు పెళ్లి భోజనాలు !

Share your comments

Subscribe Magazine