News

కొత్త తరహా పెళ్లి :పశువులు ,పక్షులకు పెళ్లి భోజనాలు !

Srikanth B
Srikanth B
Image credit : Maharastratimes
Image credit : Maharastratimes

పెళ్లి అనగానే అందరు మొదట అడిగేది భోజనాలు ఏం పెడుతున్నారని , ఎన్ని రకాల వంటలు ఉన్నాయని అయితే మహారాష్ట్రలో కొంచం దయ గుణం తో ఆలోచించిన రైతు తన కొడుకు పెళ్ళికి బంధువులతో పాటు పశువులు , పక్షులు , చీమలకు బోజనాలను ఏర్పాటు చేసాడు ఇప్పుడు ఈ వార్త దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమయింది .

మహారాష్ట్ర బుల్దానా జిల్లాలోని కొతాలి అనే కుగ్రామానికి చెందిన ఓ చిన్న సన్నకారు కారు రైతు తన కూతురి వివాహాన్ని ఎంతో వైభవం గ జరిపించాడు , పెళ్ళికి వచ్చిన వారందరితోపాటు దేశవ్యాప్తంగా పరాజయాలు చర్చించుకునే విధంగా పెళ్లి జరిపించాడు , అందరు చర్చించుకోవడానికి ఈ వివాహం ప్రత్యేకత ఏమిటంటే పెళ్ళికి ఊరిలోఉన్న ప్రజలతో పాటు పశువులకు మరియు పక్షుల కోసం కూడా ఆహారాన్ని తాయారు చేయించారు , పశువులకు గడ్డిని , పక్షులకు చిరుధాన్యాలను , చీమలకు కోసం బెల్లాన్ని సిద్ధం చేయించి ఉరి ప్రజలతోపాటు పశువులకు , జంతువులకు ఆహారాన్ని అందించారు దీనితో ఇప్పుడు ఈ పెళ్లి పై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది .


కొత్తలి గ్రామానికి చెందిన సన్నకారు రైతు ప్రకాష్ సరోదే ఏకైక కుమార్తె వివాహ వేడుక. ఈ కల్యాణ మహోత్సవం కోసం గ్రామ సమీపంలోని ఐదెకరాల పొలంలో మండపాన్ని ఏర్పాటు చేశారు. ఈ వివాహానికి కొత్తలి గ్రామ సమీపంలోని మరో ఐదు గ్రామాల ప్రజలను ఆహ్వానించి సుమారు పది వేల మందికి ఇక్కడే విందు ఏర్పాటు చేశారు.

రేషన్ కార్డ్ దారులకు శుభవార్త .. బియ్యం బదులు డబ్బులు.. ఎక్కడంటే?

ఇది మాత్రమే కాదు, సరోదే ప్రాంతంలోని పశువులు, జంతువులు మరియు పక్షులకు ఆహారాన్ని అందించింది. ఇందుకోసం గ్రామంలోని ఆవుల కోసం పదిటన్నుల గడ్డి , పశువులకు ఎండు మేత, ఆ ప్రాంతంలో ఉన్న కుక్కలకు కూడా ఆహారం అందించారు. అంతేకాదు ఆ ప్రాంతంలో చీమలకు ఆకలి వేయకూడదని చీమలకు రెండు బస్తాల పంచదార విసిరారు. ఈ రాయల్ వెడ్డింగ్ సందర్భంగా ఎవరూ ఆకలితో అలమటించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.


ప్రకాష్ సరోదే తన ముద్దుల కూతురిని ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్న అతుల్ దేవానే అనే యువకుడికి ఇచ్చి ఘనంగా పెళ్లి జరిపించాడు ఈ రైతు.

రేషన్ కార్డ్ దారులకు శుభవార్త .. బియ్యం బదులు డబ్బులు.. ఎక్కడంటే?

Related Topics

viral news

Share your comments

Subscribe Magazine