Telangana Weather latest Updates: తెలంగాణకు మరో నాలుగు రోజుల పాటు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ]ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. పలుచోట్ల 5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
Telangana Weather latest Updates: తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో పగటి పూట ఉష్ణోగ్రతల్లో స్వల్ప తగ్గుదల నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరగా... వర్షాల కారణంగా 5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గవచ్చునని తెలిపింది. కొన్ని జిల్లాల్లో 2 నుంచి 3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది .
, మంచిర్యాల, నిర్మల్,కుమ్రం భీం ఆసిఫాబాద్ ,సిద్ధిపేట,ఆదిలాబాద్, కరీంనగర్, కామారెడ్డి, సంగారెడ్డి, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి,సిరిసిల్ల, మెదక్, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైనే నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మరో 3, 4 రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది .
అగ్రి టెక్ సౌత్ 2022 యొక్క 3వ వార్షిక సదస్సు నేడు PJTSAU లో ప్రారంభం !
Hyderabad weather :హైదరాబాద్‌లో భారీ ఈదురు గాలులు :
హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గురువారం (ఏప్రిల్ 21) వర్షం కురిసింది. హైదరాబాద్‌లో గంటకు 40-50కి.మీ వేగంతో భారీ ఈదురు గాలులు వీచాయి. పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. కొన్నిచోట్ల చెట్లు విద్యుత్ స్తంభాలపై పడటంతో విద్యుత్ అంతరాయం తలెత్తింది.
భారీ వర్షం కారణంగా వాతావరణం అనుకూలించకపోవడంతో శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన పలు విమానాలను బెంగళూరు, నాగ్‌పూర్‌కు మళ్లించారు. మూసాపేటలో అత్యధికంగా 16.33 మి.మీ వర్షం కురిసింది.
Share your comments