తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, PMFBY సీఈఓ మరియు జాయింట్ సెక్రెటరీ, రితేష్ చౌహన్తో, శుక్రవారం జరిగిన భేటీ తరువాత, తెలంగాణ తిరిగి PMFBY స్కీంలో చేరుతున్నట్లు తెలిపారు.
2020 వరకు తెలంగాణాలో అమలులో ఉన్న ప్రధాన్ మంత్రి ఫసల్ భీమా యోజన ఆ తరువాత కొన్ని కారణాల వల్ల ఈ స్కీం నుండి విరమించుకుంది. అయితే తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ స్కీం మీద పునరఃసమీక్ష జరిపి, రైతులకు మేలు కలుగుతుంది అనే ఉదేశ్యంతో ఈ స్కీంను తిరిగిప్రారంభించే యత్నం చేసింది. ఇకనుండి తెలంగాణాల రైతులు కూడా ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన(PMFBY)పధకాన్ని వినియోగించుకోవచ్చు.
ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన(PMFBY):
రైతులకు ప్రకృతి విపత్తుల ద్వారా సంభవించే పంట నష్టాన్ని, కవర్ చేసేందుకు ఈ స్కీం ఉపయోగపడుతుంది. 2016, రబి సీజన్లో, మినిస్ట్రీ అఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్, ఈ స్కీంని ప్రవేశపెట్టింది. ఈ స్కీం ద్వారా 2018 గణాంకాల ప్రకారం, 70,27,637 మంది రైతులు లబ్ది పొందుతున్నారు. ఈ స్కీంలో , ధాన్యం, నూనె గింజలు, వార్షిక పంటల రైతులు భాగస్వాములు అయ్యి వారి పంటలకు ఇన్సూరెన్స్ పొందవచ్చు. ధాన్యం, పప్పుదినుసులు, నూనెగింజల పంటలకు, ఖరీఫ్ సీజన్లో 2% రబీ సీసన్కు 1.5% ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది.
2020లో అప్పటి ప్రభుత్వం ఈ స్కీం నుండి నిస్కర్మించింది. తెలంగాణాలో సర్కారు మారిన తర్వాత, ఈ స్కీంను తిరిగి ప్రారంభించబోతున్నారు. ప్రకృతి విపత్తుల వళ్ళ సంభవించే, నష్టాల నుండి రైతులను కాపాడడానికే ఈ స్కీం ని తమ రాష్ట్రంలో అమలులోకి తీసుకువచ్చాం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
Share your comments