ఖరీఫ్ సీజన్ కు రావాల్సిన రైతు బందు కోసం రైతులు అందరూ ఎదురుచుస్తుండగా, తెలంగాణ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఏడూ శాతం రైతులకు రైతు బంధు నిలిపేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
రైతులకు ఆర్ధిక సహకారాన్ని అందించి, వ్యవసాయ ఉత్పాదకతను పెంచేందుకు, 2018-19 సంవత్సరం ఖరీఫ్ సీజన్ నుండి రైతు బంధు కార్యక్రమాన్ని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మొదలు పెట్టింది. ఈ స్కీం ద్వారా ఎకరాకు 5,000రూ చొప్పున రైతులకు సహాయంగా అందిస్తారు. ఈ నగదు సహాయం ఖరీఫ్ మరియు రబీ సీజన్లకు లభిస్తుంది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతు బంధు లో సీలింగ్ మొదలు పెటింది. ఈ సీలింగ్ ప్రకారం రాష్ట్రంలోని ఏడూ శాతం రైతులకు రైతుబంధు కట్ చెయ్యనున్నారు. ఈ ఏడూ శాతంలో, టాక్స్ పేయర్స్ మరియు కొందరు పొలిటికల్ లీడర్స్ కి చెందిన భూములు ఉన్నాయ్. వీటితోపాటుగా, పాడుబడ్డ భూములు, సాగు లేని భూమి యజమానులకు రైతుబంధు నిలిపివేయ్యనున్నారు.
ఇది ఇలా ఉండగా, తెలంగాణలో ఇప్పటికే 84 శాతం రైతులకు రైతు బంధు నిధులు విడుదల చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరో రెండు రోజుల్లో మిగిలిన రైతులకు కూడా రైతుబంధు నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. తద్వారా రైతుల ఖాతాల్లో తొందర్లోనే రైతుబంధు నిధులు జామకానున్నాయి.
Share your comments