దేశ వ్యాప్తముగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి ఉత్తరాది రాష్ట్రాలలో అయితే ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నాయి . దక్షిణాది రాష్ట్రాలలో అంతగా ఉండాని చలి ఈ సంవత్సరం కాస్త పెరిగిందని చెప్పవచ్చు . రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గత రెండు మూడు రోజులుగా వాతావరణం పూర్తిగా చల్లబడుతోంది. కనీసం మధ్యాహ్న సమయంలో ఎండ రావడం లేదు .
మరోవైపు ఉష్ణోగ్రతలు పడిపోతుండగా పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు నగరంలో మబ్బుల తో కూడిన వాతావరణం కనిపించింది. హైదరాబాద్ లో పలుచోట్ల వర్షం కురిసింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత నగరం, శివారు ప్రాంతాల్లో చిరు జల్లులు పడగా, శుక్రవారం ఉదయం మళ్లీ ఓ మోస్తరు నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. ఒకవైపు చలితో పాటు చలిగాలులతో ఉదయం ప్రజలు బయటకు రావడం లేదు, చలికి వర్షం తోడు అవ్వడంతో చలి తీవ్రత మరింత పెరిగింది. వర్షం ప్రభావంతో చలి తీవ్రత మరింత పెరగవచ్చని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ : పొగాకు రైతులకు 10 వేలు వడ్డీ లేని ఋణం...
ఇవాళ తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు రానున్న ఏడు రోజుల పాటు వాతావరణ సూచన, హెచ్చరికల బులెటిన్‌ను విడుదల చేసింది. శుక్రవారం పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో రేపటి నుంచి ఈ నెల 10వ తేదీ వరకు పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంటుందని వెల్లడించారు.
Share your comments