ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ నుండి విడిపోయిన తరువాత, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తోంది. ముఖ్యంగా ఐటీ రంగంలో అంచలంచలుగా ఎదిగి, అంతర్జాతీయంగా అభివృద్ధి చెందిన నగరాలకు ధీటుగా, హైదరాబాద్ నగరం సత్తా చాటుకుంటుంది. దీనితోపాటుగా వ్యవసాయ రంగంలోనూ, తెలంగాణ రాష్ట్రం, మెరుగైన వృద్ధి రేటును కనబరుస్తుంది. అదేవిధంగా ఆంధ్ర ప్రదేశ్లో కూడా వ్యవసాయ రంగంలో హవా కొనసాగుతుంది.
వ్యవసాయ రంగంలో దేశంలో వివిధ రాష్ట్రాల్లోని పనితీరును పరిశీలించిన దేశ వ్యవసాయ ఆర్ధిక వేత్తలు ఒక నివేదిక ప్రచురించారు.2006 నుండి 2021-22 సంవత్సరం వరుకు తెలంగాణ వ్యవసాయంలో సాధించిన స్థిరాభివృధిని కొనియాడుతూ ఒక నివేదిక విడుదలయ్యింది. ఈ నివేదిక ప్రకారం, 8.6 స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తిలో(GSDP )తో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మూడో స్థానం దక్కించుకోగా, 8.9 శాతం GSDP తో గుజరాత్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. అదేవిధంగా 8.7 శాతంతో ఉత్తరాఖండ్ రెండొవ స్థానంలో కొనసాగుతుంది.
వ్యవసాయ ఆర్ధికవేత్తల నివేదిక ప్రకారం, రాష్ట్ర GSDP వృద్ధిలో వ్యవసాయ రంగం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం వ్యవసాయంతో పాటు దాని అనుబంధ రంగాల్లో 6.4 శాతం సగటు వార్షిక వృద్ధిరేటు సాధించి మూడో స్థానంలో నిలిచిందని నివేదికలో పేర్కొన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో వృద్ధిరేటు అత్యధికంగా మధ్యప్రదేశ్లో 7.3 శాతంగా ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ 6.6 శాతంతో రెండొవ స్థానంలో ఉండగా, ఝార్ఖండ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు తరువాతో స్థానాల్లో కొనసాగుతున్నాయి.
తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి 2018-19లో 9.5 శాతం, 2019-20లో 8.2, 2020-21లో 2.4, 2021-22లో 19.1, 2022-23లో 15.6 శాతం స్థిరమైన GSDP వృద్ధిరేటును నమోదు చేసినట్లు నివేదిక వెల్లడించింది. 2015-16 నుంచి AAGR డేటాను స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తితో కలిపి పరిగణలోకి తీసుకుంటే కచ్చితంగా రాష్ట్రం అగ్రస్థానంలో ఉండేదని ఆర్థిక శాఖకు చెందిన ఓ అధికారి పేర్కొన్నట్లు చెప్పింది.
Share your comments