తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జరగాల్సిన ఈ విద్యాసంవత్సరంకి సంబంధించి టెన్త్, ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను రద్దు వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గురువారం విద్యాశాఖ అధికారులతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పదో, ఇంటర్ పరీక్షలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం టెన్త్, ఇంటర్ప ఫస్ట్ ఇయర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు సబితా ఇంద్రారెడ్డి అధికారింగా ప్రకటించారు.
అనంతరం సాయంత్రం పరీక్షల రద్దుకి సంబంధించి ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. పరీక్షలు లేకుండా పాస్ కావడంతో టెన్త్, ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు పండుగ చేసుకుంటున్నారు. టెన్త్, ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేశారు. అయితే ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు కరోనా తగ్గిన తర్వాత పరీక్షలు నిర్వహించే అవకాశముంది. మే 1 నుంచి 19వరకు సెకండియర్ పరీక్షలు జరగాల్సి ఉంది.
ప్రస్తుతం వాయిదా వేయగా.. జూన్‌లో కరోనా పరిస్థితులను బట్టి సెకండియర్ పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ అప్పటికీ కరోనా ప్రభావం తగ్గకపోతే పరీక్షలను రద్దు చేసి పైతరగుతులకు ప్రమోట్ చేసే అవకాశం లేకపోలేదు. జూన్‌లో సమీక్ష నిర్వహించి 15 రోజులు ముందుగా షెడ్యూల్ విడదల చేస్తామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
అయితే సెకండ్ ఇయర్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. బ్యాక్‌ల్యాగ్స్ ఉంటే కనీస మార్కులతో పాస్ చేస్తామని పేర్కొంది. బ్యాక్ ల్యాగ్స్ సబ్జెక్టులకు మాత్రమే ఇది వర్తిస్తుందని వెల్లడించింది. దీని వల్ల ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అయిన 1,99,019 మంది విద్యార్థులకు ఊరట కలిగించింది.
ఇక ఎంసెట్ లో 25 శాతం వెయిటేజీని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇక సెకండియర్ ప్రాక్టీకల్స్‌ను ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసిన విషయం తెలిసిందే. ఫస్టియర్ వారికి ఇప్పటికే ఇంటర్నల్స్ నిర్వహించారు. కాగా దేశంలో కరోనా తీవ్రత పెరిగిపోతుండటం. రికార్డు స్థాయిలో రోజువారీ కేసులు నమోదవుతుండటంతో.. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సీబీఎస్‌ఈ పరీక్షలను వాయిదా వేసింది. టెన్త్ పరీక్షలను వాయిదా వేయగా.. 12వ తరగతి పరీక్షలను తర్వాత నిర్వహించనుంది. దీంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా టెన్త్ పరీక్షలను రద్దు చేస్తున్నాయి.
Share your comments