విదేశాల నుంచి వచ్చే వారు సర్వ సాధారణములగా అనుమతి లేని చాల వస్తువులను ఒక దేశం నుంచి మరొక దేశానికి తీసుకెళ్తు ఎయిర్‌పోర్టు భద్రత సిబ్బందికి దొరికి పోతుంటారు , ఇందులో ఎక్కువగా బంగారం లేదా వజ్రాలు మరియు డ్రగ్స్ తరలిస్తుండగా దొరికి పోయిన ఘటనలను మనం వినే ఉంటాం . దీనికి భిన్నం నిన్న మెక్సికోలోని విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారుల తనిఖీ నిర్వహింస్తుండగా స్కానింగ్ మెషిన్ గుండా వెళుతున్నప్పుడు ఒక ప్యాకేజీలో నాలుగు మానవ పుర్రెలను చూసి ఖంగుతిన్నరు .
. ప్రతి దేశం భద్రత కోసం సాధారణంగా ఎయిర్‌పోర్టులు, మెట్రోస్టేషన్‌లలో చెకింగ్ మెషిన్‌లను ఏర్పాటు చేస్తారు.ఈ తనిఖీలు అయా ప్రదేశాల్లో సాధారణమే. మెక్సికన్ విమానాశ్రయంలోనూ భద్రతా సిబ్బంది ఎక్స్ రే మిషన్ల సాయంతో ప్రయాణికుల లగేజీలను తనిఖీ చేస్తున్నారు.
ఈ క్రమంలో యూఎస్ కు పంపాల్సిన కొరియర్ సూట్ కేసులో నాలుగు మానవ పుర్రెలను వారు కనుగొన్నారు. వాటిని చూసి షాకవడం అధికారుల వంతయ్యింది. సంబంధిత డాక్యుమెంట్ల ఆధారంగా మెక్సికోలోని అత్యంత హింసాత్మక రాష్ట్రాల్లో ఒకటైన మిచోవాకాన్ నుంచి దక్షిణ కరోలినాకు ఆ పుర్రెలను కొరియర్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కాగా, కొరియర్‌లో పుర్రెలు రావడంపై ఎయిర్‌పోర్టు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు . ఎవరు పుంపుతున్నారు..? ఎవరికి పంపుతున్నారు..? దేని కోసం పంపుతున్నారు..? అనే కోణంలో విచారిస్తున్నారు .
రూ . 500,1000 నోట్ల రద్దు పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు ...
స్కానింగ్ మెషిన్ ద్వారా కార్డ్‌బోర్డ్ పెట్టెలో వింత ఆకృతులను గుర్తించిన తర్వాత.. వారు ప్యాకేజీని తెరిచి చూడగా, ప్లాస్టిక్, అల్యూమినియం ఫాయిల్‌తో చుట్టబడిన నాలుగు మానవ పుర్రెలు కనిపించాయి. ఈ పెట్టె దక్షిణ కరోలినాలోని మన్నింగ్‌లోని దక్షిణ నగరమైన అపాజ్‌టింగాన్ నుండి పంపబడిందని అక్కడి సిబ్బంది తెలిపారు .
Share your comments