ఆధార్, పాన్ కార్డు. దేశంలోని ప్రజలందరికి అవసరమైన ఐడెంటిటీ కార్డులు. ప్రభుత్వ స్కీమ్ ఏది పొందాలన్నా... బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలన్నా... సిమ్ కార్డు తీసుకోవాలన్నా.. ఇలా ప్రతిదానికి ఈ రెండూ అవసరమే. ఒకరకంగా చెప్పాలంటే ఈ రెండూ కార్డులు లేనిది ఏ పని జరగదు. ఆధార్ వ్యక్తి ఐడెంటిటీని సూచిస్తుంది. ఇక వ్యక్తి ఆర్థిక విషయాలను పాన్ కార్డు తెలియచేస్తుంది. దేశంలో ప్రతివ్యక్తికి ఈ రెండూ అవసరమే.
అయితే మరింత సౌలభ్యం కోసం ఆధార్, పాన్ కార్డును లింక్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిబంధన పెట్టింది. జూన్ 30 వరకు గడువు ఇచ్చింది. చాలామంది ఇంకా లింక్ చేసుకోకపోవడంతో ఈ గడువును ఇప్పటికే చాలాసార్లు పెంచింది. అయితే ఈ సారి ఇక గడువు పెంచే అవకాశం లేదని, ఇదే చివరి ఛాన్స్ అని తెలుస్తోంది. దీంతో ఆధార్-పాన్ లింక్ చేసుకోనివాళ్లు ఇప్పటికైనా చేసుకుంటే మంచిది.
లేకపోతే ఇబ్బందులు పడే అవకాశముంది. లింక్ చేయనివారి పాన్ కార్డులను బ్లాక్ చేస్తామని, అవి ఇక చెల్లవని ఐటీశాఖ హెచ్చరించింది. మీరు జూన్ 30లోగా లింక్ చేసుకోకపోతే ఆ తర్వాత ఇక పాన్ కార్డు చెల్లదు. ఒకవేళ అది పనిచేయాలంటే 2021 జూలై 1 తర్వాత కూడా లింక్ చేయొచ్చు. కానీ ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని కొత్త సెక్షన్ 234హెచ్ ప్రకారం రూ.1,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
ఆధార్-పాన్ లింక్ అయిందో.. లేదో తెలుసుకోవడమెలా?
-https://www.incometax.gov.in/iec/foportal వెబ్ సైట్ లోకి వెళ్లండి
-అందులో కనిపించే లింక్ ఆధార్() మీద క్లిక్ చేయండి
-ఆ తర్వాత పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ మీద క్లిక్ చేయండి
-ఆ తర్వాత మీ ఆధార్, పాన్ లింక్ అయిందో.. లేదో తెలుస్తుంది.
-Your PAN linked to Aadhaar Number అని మెసేజ్ కనిపిస్తే ఆధార్ నెంబర్‌కు పాన్ నెంబర్ లింక్ అయినట్టే. ఏ ఆధార్ నెంబర్‌కు పాన్ నెంబర్ లింక్ అయిందో కూడా తెలుస్తుంది. ఆధార్ నెంబర్‌లో చివరి నాలుగు అంకెలు కనిపిస్తాయి.
ఫోన్ ద్వారా తెలుసుకోవడం ఎలా?
-UIDPAN < 12 digit Aadhaar number> < 10 digit Permament Account Number> అని ఎస్ఎంఎస్ టైప్ చేసి 567678 లేదా 56161 నెంబర్‌కు ఎస్ఎంఎస్ చేయాలి
-ఆ తర్వాత లింక్ అయిందో.. లేదో తెలియజేస్తూ మీ మొబైల్ కు మెసేజ్ వస్తుంది
లింక్ చేసుకోవడం ఎలా?
-https://www.incometax.gov.in/iec/foportal వెబ్ సైట్ లోకి వెళ్లండి
-లింక్ ఆధార్ విత్ పాన్ నెంబర్ అనే ట్యాగ్ మీద క్లిక్ చేయండి
-ఆ తర్వాత మీ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, ఆధార్ కార్డు ప్రకారం పేరు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లింక్ ఆధార్ బటన్ మీద క్లిక్ చేయండి.
మొబైల్ ద్వారా లింక్ చేసుకోవడం ఎలా?
-UIDPAN అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి స్పేస్ ఇచ్చి 10 డిజిట్ పాన్ నెంబర్ ఎంటర్ చేసి 567678 లేదా 56161 నెంబర్లకు ఎస్ఎంఎస్ పంపాలి. మీకు కొద్దిసేపటి తర్వాత కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.
Share your comments