బ్యాంకింగ్ వంటి ఆర్ధిక కార్యకలాపాలను మరియు సంక్షేమ పథకాల దుర్వినియోగాన్ని అరికట్టడానికి పాన్-ఆధార్ కార్డ్ లింకింగ్ ను తప్పని సరి చేసింది కేంద్రం.ఈ ప్రక్రియని గతంలోనే ఈ ఏడాది 2023 మార్చి 31 వరకు పొడిగించిన సంగతి విదితమే అయినప్పటికీ....కొద్దీ రోజులలో గడువు ముగియనున్న క్రమంలో ఆదాయపు పన్ను శాఖ పాన్‌ను ఆధార్‌తో లింక్ గడువు మరో సరి పొడిగిస్తూ ఉత్తర్వూలు జారీ చేసింది .
. ఆదాయపు పన్ను శాఖ లాస్ట్ వార్నింగ్ ఇచ్చింది. పాన్ కార్డ్ ఉన్నవారంతా తమ ఆధార్ నెంబర్‌ను లింక్ చేయాల్సిందే. పాన్ ఆధార్ లింక్ చేయడానికి 2023 మార్చి 31 చివరి తేదీ కాగా ఎప్పుడు పెరిగిన గడువుతో జూన్ 30 వరకు పాన్‌ను ఆధార్‌తో లింక్ చేసుకోవచ్చు , జూన్ 30 వరకు లింక్ చేసుకోకపోతే జులై 1 నుంచి మీ ఆధార్ కార్డ్ పనిచేయదు .
జూలై 1, 2023 నుండి, అవసరమైన విధంగా తమ ఆధార్‌ను తెలియజేయడంలో విఫలమైన పన్ను చెల్లింపుదారుల PAN పనిచేయదు. అయితే, రూ. 1,000 రుసుము చెల్లించిన తర్వాత నిర్ణీత అథారిటీకి ఆధార్‌ను తెలియజేసినప్పుడు, పాన్‌ను 30 రోజుల్లో మళ్లీ ఆపరేటివ్‌గా చేయవచ్చు, మంత్రిత్వ శాఖ పేర్కొంది.మార్చి 28 నాటికి, 51 కోట్లకు పై గా పాన్‌లు ఇప్పటికే ఆధార్‌తో లింక్ చేయబడ్డాయి, ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.
రేషన్‌కార్డుదారులకు శుభవార్త: వచ్చే నెల నుండి ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణి
సెక్షన్ 139AA నుండి ఆదాయపు పన్ను చట్టం 1961లోని సబ్-సెక్షన్ (2) ప్రకారం, జూలై 1, 2017 నాటికి పాన్ కేటాయించబడిన ప్రతి వ్యక్తి ఆధార్ మరియు పాన్‌లను లింక్ చేయడానికి తన ఆధార్ నంబర్‌ను తెలియజేయడం తప్పనిసరి .
Share your comments