ప్రపంచ శిఖరాగ్ర సదస్సు అయినా జీ- 20 సదస్సు ఈ సంవత్సరం ఢిల్లీలో 9,10 తేదీల్లో జరగబోతుంది. జీ- 20 సదస్సు సన్నాహాలు ఢిల్లీతో పాటు విబివిధ నగరాల్లో కూడా మొదలుపెట్టారు. గ్లోబల్ లీడర్ ఎదగటానికి మన భారతదేశానికి ఇది చక్కటి అవకాశం. అంతర్జాతీయంగా వివిధ దేశాల మధ్య పరస్పర ఆర్ధిక సహకారాన్నీ, సాంకేతికతను ఇచ్చిపుచ్చుకునేందుకు మరియు ప్రపంచ దేశాల మధ్య ఉమ్మడి సమస్యలను పరిష్కరించుకోవడానికి మార్గాలను సూచించే శక్తివంతమైన వేదిక ఇది. ప్రపంచంలోనే బాగా అభివృద్ధి చెందిన 20 పెద్ద దేశాలకు ఒక సంవత్సరం పాటు న్యాయకత్వ భాధ్యతలను చూసుకునే అవకాశం ఇది. ఈ సదస్సులో వివిధ అంశాలైన పర్యావరణం, సరిహద్దు సమస్యలు, టెక్నాలజీ, భారతదేశానికి అవసరమయ్యే పెట్టుబడులు వంటి విషయాలపై చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకుంటారు.
ఈ సదస్సులో భారత్ తో పాటూ అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేసియా, ఇటలీ, జపాన్, దక్షిణ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, యూకే, అమెరికా, యూరోపియన్ యూనియన్లు పాల్గొంటాయి. వీరితో పాటు భారత్ నేతృత్వంలో ఎంపిక చేయబడే జీ-20లో లేని పలు దేశాల ముఖ్య నేతలు, అధికారులు కూడా ఈ సదస్సుకు అతిథులుగా వస్తారు.
ఈ జీ-20 గ్రూప్ సెప్టెంబర్ 25న, 1999లో ఆవిర్భవించింది. ప్రతి సంవత్సరం ఏదో ఒక దేశంలో డిసెంబర్ 1 నుండి తర్వాత సంవత్సరం నవంబర్ 30 వరకు ప్రపంచ శిఖరాగ్ర సదస్సులు నిర్వహిస్తారు. తరచుగా మనం జీ 2, జీ 4, జీ 7, జీ 10, జీ 15 అనే పేర్లను అంతర్జాతీయ వేదికలపై వింటూనేఉంటాం. అయితే వీటిల్లో అత్యంత శక్తివంతమైన గ్రూపే ఈ జీ-20. ప్రపంచ జనాభాలో రెండు వంతుల జనాభా దీనిదే. 85 శాతం ప్రపంచ జీడీపీ లో వాటా, ప్రపంచ మార్కెట్లో 75 శాతం వాటా ఈ జీ-20 గ్రూపుకి చెందుతుది. ప్రపంచంలోనే అత్యంత బలమైన ఆర్ధిక వ్యవస్థలు అన్ని ఈ వేదిక పైనే కనిపిస్తాయి. ఇక్కడ తీసుకునే నిర్ణయాలు ప్రపంచం మొత్తన్నీ ప్రభావితం చేస్తాయి.
ఇది కూడా చదవండి..
తెలంగాణ బడ్జెట్ 2023: ఏ రంగానికి ఎంత కేటాయించారంటే?
జీ-20 సదస్సు ఢిల్లీ కన్నా ముందు దేశంలో వివిధ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన 56 నగరాల్లో, పట్టణాల్లో 32 రంగాలకు చెందిన అంశాలపై ఇంచుమించుగా 200 సదస్సులు జరుగుతాయి. ఈ సదస్సులు ముంబై, జైపూర్, విశాఖపట్నం, వంటి నగరాల్లో నిర్వహించనున్నారు. బెంగుళూరులో 2022 డిసెంబర్ 13న మొదటి సమావేశం జరిగింది. 2023 మార్చి 28, 29 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే సన్నాహక సదస్సుకు 40 దేశాల నుంచి దాదాపు 300 మంది అంతర్జాతీయ, జాతీయ ప్రతినిధులు హాజరు కాను న్నారు. జీ-20 విదేశాంగ మంత్రులు, రాయబారులతో పాటు మన కేంద్ర మంత్రులు కూడా పాల్గొంటారు. దీంతో విశాఖలో మార్చి తొలి వారంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్, ఆఖరి వారంలో జీ-20 సన్నాహాక సదస్సు వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా దేశంలోని అన్ని రాష్ట్రాలూ తమ దగ్గర ఉన్న పెట్టుబడి అవకాశాలు, వనరుల గురించి వివరించే అవ కాశం దక్కుతుంది.
ఇది కూడా చదవండి..
Share your comments